India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వదినును తల్లిని చేసి వదిలేసిన దుర్మార్గపు ఘటన ఇది. నల్లబెల్లి చిన్నతండాకు చెందిన రాజుకు చెన్నరావుపేట(M)కు చెందిన మమతతో 2017లో పెళ్లైంది. రాజుకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో మరిది శ్రీనుతో పిల్లలు కంటే ఆస్తి మనదేనని అత్తామామలు నమ్మబలికారు. ఈక్రమంలో శ్రీను, మమతకు ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత మమతతో గొడవపడి పుట్టింటికి పంపేశారు. శ్రీను వేరే పెళ్లికి రెడీ కావడంతో మమత పోలీసులను ఆశ్రయించింది.
అనారోగ్యంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ సీఐ కథనం ప్రకారం.. నెక్కొండ మండలం రెడ్డవాడకు చెందిన నవీన్(24) నాలుగు నెలలుగా గొంతునొప్పితో బాధపడుతూ.. MGMలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం HYDకి వెళ్లాలని వైద్యులు సూచించారు. భయాందోళనకు గురైన నవీన్ అదేరోజు రాత్రి జాన్‌పీరీలు గేట్ సమీపంలో పుష్‌పుల్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై అత్యాచారం చేసిన ఘటనపై బుధవారం సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. KNRకు చెందిన నర్సింగ్ విద్యార్థిని WGL ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందుతోంది. ఇటీవల కామారెడ్డికి చెందిన సతీశ్‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో సతీశ్ ఆమెను కామారెడ్డికి రావాలని కోరగా.. రెండ్రోజుల కిందట వెళ్లింది. ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నీటి సరఫరా జరిగే క్రమంలో ఏర్పడే సందేహాల నివృత్తికి ప్రత్యేక ఫోన్ నంబర్ 7207908583ను ఏర్పాటు చేసినట్లు వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే తెలిపారు. 66 డివిజన్ల వ్యాప్తంగా ఉ.6 గం.ల నుంచి రా. 8 గం.ల వరకు నీటి సరఫరా జరిగే సమయాల్లో ఇబ్బందులు ఏర్పడితే సూచించిన నంబరుకు సమాచారం అందించాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తారన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ కో-ఆర్డినేటర్లను TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమించారు. హన్మకొండ జిల్లా నుంచి వరంగల్ పశ్చిమ – సంగీత, వరంగల్ తూర్పు- జాలి కమలాకర్ రెడ్డి, కుందూరు వెంకటరెడ్డి – వర్ధన్నపేట, మార్కం విజయ్ కుమార్ – భూపాలపల్లి, కూచన రవళి రెడ్డి – ములుగు, పింగిళి వెంకట్రామిరెడ్డి – స్టేషన్ ఘనపూర్, డా. పులి అనిల్ కుమార్ – నర్సంపేట, పరకాల – అశోక్ రెడ్డిని నియమించారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో BRS టికెట్ కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు, ఉద్యమకారులు ఈ టికెట్ కోసం ప్రయత్నాలు షురూ చేశారు. ఇప్పటికే పలువురు నేతలు క్షేత్ర స్థాయిలో పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ వారికి వినతి పత్రాలు ఇచ్చారు. టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ విద్యుత్ భవన్, కార్పొరేట్ కార్యాలయంలో నేడు 16 జిల్లాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, ఎస్ఏఓలు, డివిజినల్ ఇంజినీర్లతో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముందుగా ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడారు. 132 కేవీ సబ్ స్టేషన్ల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు .
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీని పొడిగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తాగునీటిని పర్యవేక్షణకు బి.గోపిని ప్రత్యేక అధికారిగా నియమించారు.
కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బాలాజీ శర్మ, ఆలయ ఛైర్మన్ లక్ష్మారెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. 7న రాత్రి 12 గంటలకు అగ్నిప్రజ్వలన , 8న ఉదయం 6 గంటలకు అగ్నిగుండ ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Sorry, no posts matched your criteria.