India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు గత మూడు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7240కి చేరింది. ఈరోజు స్వల్పంగా పెరిగి, రూ.7260 అయింది. అయితే గతేడాదిలా.. కాకుండా ఈసారి పత్తి ధరలు భారీగా పడిపోయాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరకట్న వేధింపులతో కొడుక్కి విషమిచ్చి ఓ తల్లి మంగళవారం KNRలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో తల్లి శ్రీజ(27), కొడుకు రేయాన్ష్(11) మృతి చెందగా.. కూతురి మృతి తట్టుకోలేక శ్రీజ తల్లి జయప్రద విషగుళికలు తిని మరణించింది. WGLకు చెందిన నరేశ్‌తో 2021లో శ్రీజ పెళ్లయింది. గొడవలతో తల్లి ఇంటికి వెళ్లిన శ్రీజ.. కొడుకు ఫస్ట్ బర్త్ డేకు పిలవగా రానని దూషించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 9 నుంచి 17వ తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. 9న ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహిస్తామని, పండితులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. 15 నుంచి 17 వరకు భక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని, సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని వివరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేత సస్పెండ్ అయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత బక్క జడ్సన్‌ను పార్టీ నుంచి 6 సంవత్సరాలు సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీ-కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ వేదికలపై పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో జడ్సన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
వరంగల్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినవారే కావడం ఆసక్తికర అంశం. అటు మహబూబాబాద్‌లోనూ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరగానే టికెట్ లభించింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతల పార్టీ మార్పుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి అలముకుంది.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న నాగార్జున మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. నర్సంపేట పట్టణం వల్లభ్ నగర్‌కు చెందిన నాగార్జున కొన్ని సంవత్సరాలుగా ఈజీఎస్‌లో టీఏగా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల కొత్తగూడ మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి.దీపికరెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మండలంలోని పర్వతగిరి గ్రామానికి చెందిన మహేశ్వరికి కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన నాదెళ్ల నవజీవన్‌తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో నవజీవన్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
వరంగల్ పార్లమెంట్ BRS తరఫున టికెట్ కోసం పలువురు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. Ex.MLA పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, నల్లబెల్లి ZPTC పెద్ది స్వప్నకు టికెట్ వస్తుందని నర్సంపేట నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారురాలైన స్వప్నకు టికెట్ ఇస్తే ఉద్యమ సెంటిమెంట్ కలిసొస్తుందని అధిష్ఠానం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. టికెట్ కోసమే ఇటీవల కేసీఆర్‌ను కలిశారనే చర్చ సాగుతోంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు పలు ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. నం.5 రకం మిర్చి క్వింటాకి రూ.13 వేలు, సింగిల్ పట్టి రకం క్వింటాకు రూ.42,500 పలికింది. అలాగే మక్కలు క్వింటాకు రూ.2,175 ధర పలికాయి. కాగా గతవారంతో పోలిస్తే ఈరోజు మక్కల ధర భారీగా తగ్గింది. ఎండ తీవ్రత నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన(కాంట్రాక్ట్) భర్తీ చేయుటకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ లకావత్ వెంకట్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 6న ప్రభుత్వ వైద్య కళాశాల మహబూబాబాద్‌లో ఉ. 10 గంటల నుంచి సా.4 గంటల వరకు హాజరు కావాలన్నారు. వివరాలకు http://gmcmahabubabad.org/ సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.