India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,200 పలకగా.. మంగళవారం రూ.7240 పలికింది. అయితే పత్తి ధరలు పెరిగేలా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తికి సరైన ధర రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెక్కొండ మండలం వెంకట్ తండా గ్రామ పంచాయితీ పరిధిలోనీ పురాతన గంగమ్మ తల్లి ఆలయ అవరణలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఆనవాళ్లను గ్రామస్థులు గుర్తించారు. ఆలయ ఆవరణలో పెద్ద గుంత తీసి దాని పక్కనే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉండటంతో గుప్త నిధుల కోసమేనని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో తవ్వకాలు జరిపారని గ్రామస్థులు తెలిపారు.
WGL జిల్లాలో దివ్యాంగుల కోసం ఈనెలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు DRDO కౌసల్యాదేవి తెలిపారు. మూగ, చెవిటి వారికి 12న, శారీరక (ఆర్థో) విభాగానికి 18, 19, 20 తేదీలు, మానసిక దివ్యాంగులకు 22న ఎంజీఎం ఆస్పత్రి, రీజినల్ కంటి ఆస్పత్రిలో కంటి సమస్యలకు సంబంధించిన క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వికలాంగత్వం ఉన్న వారు మీ సేవ కేంద్రాల్లో నేడు ఉదయం 11 నుంచి స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.
కాళేశ్వరం దేవస్థానం ఆలయ వేళల్లో మంగళవారం నుంచి మార్పులు చేసినట్లు ఈఓ ఎస్.మహేష్ తెలిపారు. వేసవికాలం సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4గంటల వరకు ద్వారా బంధనం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ద్వారం మూసేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు భక్తులకు ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ స్థానం రోజుకో మలుపు తిరుగుతోంది. BRS సిట్టింగ్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు టికెట్ ఇవ్వకుండా కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీ మారారు. తీరా కావ్య సైతం ఇటీవల BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా.. ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. దీంతో BRS మరో అభ్యర్థిని అన్వేశించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, BJP టికెట్ ఆరూరి రమేశ్‌కు కేటాయించిన విషయం తెలిసిందే.
జాతర సమయంలో వనదేవతల దర్శనానికి రాని భక్తులు ప్రస్తుతం మేడారానికి తరలివస్తున్నారు. అయితే జాతరకు వస్తున్న భక్తులపై ఎండ ప్రభావం తీవ్రంగా పడుతోంది. దర్శించుకునే క్రమంలో గద్దెల ప్రాంగణంలో నీడ లేకపోవడం, కింద పూర్తిగా నాపరాళ్లు ఉండటంతో.. అవస్థలు తప్పట్లేదు. దీంతో గోవిందరాజు గద్దెవైపు చెట్ల నీడ పడుతుండటంతో దర్శనం తర్వాత అటుగా వెళ్తున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను తీర్చాలని భక్తులు కోరుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2023-24 సంవత్సరానికి రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం కొద్దిగా తగ్గినా రిజిస్ట్రేషన్ దస్తావేజుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 1,09,892 దస్తావేజులకు గాను రూ.335.01 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం రూ.350 కోట్లు ఆదాయం సమకూరింది.
మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మండిపడ్డ ఆయన.. బీఆర్ఎస్‌ను వీడిన వారు KCRపై బురద చల్లడం సరికాదని మండి పడ్డారు. కడియం దళితులపై లేని పోని కుట్రలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆదేశిస్తే వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం పార్టీ మారడం సరికాదన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కానీ అర్ధఎకరం కోసమైతే వస్తారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాంగ్రెస్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకనే ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు.
వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి వడగాల్పులు, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి సోమవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రానున్న 2 నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని..ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగుజాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోడప్రతులను ఆవిష్కరించారు.
Sorry, no posts matched your criteria.