India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖిలావరంగల్‌లో కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాల సంరక్షణను కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గాలి కొదిలేశారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. పడమరకోట చమన్ కూడలిలోని నివాస గృహాల నడుమ ఉన్న కట్టడంపై ఏపుగా ముళ్ల పొదలు పెరిగాయి. ఫలితంగా రాళ్లు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితిలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చెట్లు తొలగించి పురాతన కట్టడాన్ని భావితరాలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
WGL పార్లమెంట్ BRS అభ్యర్థి విషయంలో రోజుకో కీలక మలుపు కొనసాగుతోంది. సిట్టింగ్ అభ్యర్థి దయాకర్‌ను కాదని కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. కానీ, తాను పోటీ చేయనని నిర్ణయం తీసుకొని తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో WGL పార్లమెంట్ టికెట్ కేటాయింపుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇటీవల పార్టీ మారిన బాబు మోహన్, తాటికొండ రాజయ్యతో పాటు పెద్ది స్వప్న పేర్లు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాల పట్ల ములుగు జిల్లా కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన కొందరు ద్రోహులు మాత్రమే పార్టీ వీడుతున్నారని, దీంతో నూతన నాయకత్వానికి అవకాశం లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
జనగామ నూతన ఏసీపీగా పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు పార్టీల ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. నూతన ఏసీపీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల యవత బెట్టింగులకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం IPL సీజన్ కావడంతో మహదేవపురం, కాటారంతో పాటు.. పలు చోట్ల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో భారీగా బెట్టింగ్ పెడుతున్నారు. వచ్చిన లాభాలను సైతం బెట్టింగ్‌కు మళ్లిస్తున్నారు. ఇటీవల కాటారం మండలంలో ఓ వ్యక్తి బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి రూ.లక్షల్లో నష్టపోయాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
పాలకుర్తిలో కాంగ్రెస్ విజయం పొందిన సందర్భంగా ఓ కార్యకర్త తిరుపతికి సైకిల్ యాత్రగా బయలుదేరాడు. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు బైకాని ఐలేశ్ శుక్రవారం తిరుపతి దేవస్థానానికి సైకిల్ యాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే యశస్విని కొబ్బరి కాయ కొట్టి యాత్రను ప్రారంభించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే BRS కీలక నేతలు పార్టీ వీడటంతో KCRకి ఊహించని షాకులు తగులుతున్నాయి. మాజీ MLA ఆరూరి రమేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌లు BJPలో చేరగా.. వరంగల్ ఎంపీ దయాకర్, DCCB ఛైర్మన్ మార్నెని రవీందర్, పలువురు MPPలు కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు MLA కడియం, ఆయన కుమార్తె కావ్యలు సైతం పార్టీని వీడుతుండటంతో BRSకు కోలుకోని దెబ్బ తగిలింది.
మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులపై స్పందించారు. తాను బీఆర్ఎస్‌ని వీడుతున్నట్లు ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని, కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని కవిత అన్నారు. తనపై నమ్మకంతోనే మళ్లీ మహబూబాబాద్ ఎంపీ టికెట్ కేసీఆర్ కేటాయించారని చెప్పారు.
వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఆ స్థానం అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. ఈ స్థానం నుంచి పలువురు పోటీ పడుతుండగా టికెట్ ఎవరికి వస్తుందో అని ఆసక్తి నెలకొంది. సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య, పరంజ్యోతి, BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్, అలాగే త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్న కడియం శ్రీహరి కూతురు కావ్య సైతం పోటీలో ఉన్నట్లు సమాచారం.
వరంగల్ జకోటియా కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మంటలు ఆర్పే క్రమంలో మట్టెవాడ సీఐ తుమ్మ గోపి ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. ఫైర్ హోంగార్డు గిరికి కూడా చేయి కాలిపోగా.. ఇద్దరిని 108 సహాయంతో ఎంజీఎంకు తరలించారు. చికిత్స అనంతరం వారికి ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వైద్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.