India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడియం ఫ్యామిలీ బీఆర్ఎస్‌కి ఝలక్ ఇచ్చారు. 6 నెలల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోతుందని ఆరోపించిన కడియం శ్రీహరి నేడో, రేపో కాంగ్రెస్‌లో చేరుతుండటంతో నియోజకవర్గంలో కారు ఢీలా పడినట్లే అని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే 3 రోజుల క్రితం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కడియం కావ్య.. ఒక్కసారిగా తన మనసు మార్చుకుని కారు గుర్తుపై కూడా పోటీ చేయనంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.
తరిగొప్పుల కేజీబీవీలో సైన్స్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న అరుణ జ్యోతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అరుణ జ్యోతి రోజూ వారి విధుల్లో భాగంగా తన భర్త బైకుపై గురువారం ఉదయం జనగామ నుంచి పాఠశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గుంటూరుపల్లి స్టేజి వద్ద బైకు అదుపుతప్పి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స కోసం HYDకు తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు చెప్పారు.
తాడ్వాయి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏటూరు నాగారం వైపు వెళ్లే జాతీయ రహదారిపై తాడ్వాయి దాటిన అనంతరం పెద్ద మోరి మూలమలుపు వద్ద బైకు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిచెందగా.. మరోవ్యక్తికి తీవ్ర గాయాలపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లారీ, బైక్ ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన గూడూరు మండలం మాచర్ల గ్రామసమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ వైపు వెళ్తున్న బైక్‌కు వెనుకాల నుంచి అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుత్తుషాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగింది. మదనపురం గ్రామశివారు ధూపతండాకు చెందిన మాలోతు బాలు గురువారం నీళ్లు పెట్టడానికి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌కు గురై బావిలో పడి ప్రాణాలొదిలాడు. స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సీరోలు మండలం మోద్గులగడ్డ తండాలో చోటుచేసుకొంది. డోర్నకల్ SI సంతోష్ రావు వివరాల ప్రకారం.. వ్యవసాయ భూమిలో బోర్ వేసే విషయంలో గుగులోతు రాజేశ్వరి(34) భర్త వంశీ, అతని సోదరుడి మధ్య వివాదం జరిగింది. ఈ విషయం పై ఇంట్లో రాజేశ్వరి, వంశీ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజేశ్వరి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఈరోజు క్వింటా పత్తి రూ.7200 ధర పలికింది. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. మంగళవారం పత్తి ధర రూ.7,170 పలకగా.. బుధవారం రూ.7,310కి చేరింది. ఈరోజు మళ్ళీ తగ్గింది. రేపటినుండి మార్కెట్‌కు వరుస సెలవులు రానుండడంతో ఈరోజు పత్తి తరలివస్తోంది.
సంకల్పానికి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడు WGL జిల్లా రాయపర్తికి చెందిన ఓ యువకుడు. బంధనపల్లికి చెందిన రాంజీనాయక్ పుట్టుకతోనే దివ్యాంగుడు. క్రికెట్‌పై ఉన్న మక్కువతో రెండు కాళ్లు పనిచేయకున్నా జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ప్రస్తుతం డీసీసీఐ బోర్డు సభ్యుడు, తెలంగాణ టీం కోర్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, దివ్యాంగులకు ఉత్తమ అవకాశాలను కల్పించడమే తన లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అదృశ్యమైన ఓ యువకుడు బావిలో శవమై తేలిన ఘటన KNR జిల్లా తిమ్మాపూర్‌లో జరిగింది. CI స్వామి వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన అభిలాశ్(20) తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా చేస్తున్నాడు. అయితే ఈనెల 1న రాత్రి అభిలాశ్ అదృశ్యమయ్యాడు. బుధవారం సాయంత్రం కుళ్లిన స్థితిలో ఓ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించగా.. ఫోన్, దుస్తుల ఆధారంగా అభిలాశ్‌గా పోలీసులు గుర్తించారు.
కాటారం మండలంలోని సుందర్ రాజ్ పేటకు చెందిన విద్యార్థిని అక్షయ(15) చికిత్స పొందుతూ మృతి చెందింది. SI అభినవ్ వివరాల ప్రకారం.. ఈనెల 19న అక్షయ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాసేందుకు ఆమె తండ్రి ప్రవీణ్‌తో కలిసి, బైక్ పై వెళ్తోంది. ఈ క్రమంలో మద్దులపల్లి సమీపంలో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. అక్షయ తలకు తీవ్ర గాయాలు కాగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.