India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్‌ను ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు అమెరికాలో గుండె పోటుతో మృతిచెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. చిట్టోజు మదనాచారి, ప్రమీల దంపతుల కుమారుడు మహేశ్.. ఏడాదిన్నర క్రితం ఉద్యోగ రీత్యా అమెరికాలోని జార్జియాకు వెళ్లాడు. ఈక్రమంలో ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురికాగా.. ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. కాగా, మృతదేహం గ్రామానికి రావడానికి 5 రోజుల సమయం పడుతుంది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను అఘోరా దర్శించుకున్నారు. బుధవారం మేడారం గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మలను తమిళనాడుకు చెందిన అఘోరా.. కాలికా ఉపాసకుడు .. శివ విభూషణరావు దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
హన్మకొండ జిల్లా కాజిపేట్‌లోని ఆర్పీఎఫ్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బందికి సురక్ష సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్పీఎఫ్ ఐజి & PCSC, SCR-అరోమా సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆర్పీఎఫ్ హాస్పిటల్‌ని సందర్శించారు. సమన్యాయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ సిఐ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పెంబర్తి వద్ద ఆటోను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు ఈశ్వర్ మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో లోక్ సభ పోరు రసవత్తరంగా మారింది. 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు ఇప్పటికే సమావేశాలు, కార్యాచరణలు రూపొందించుకుంటున్నారు. BRS నుంచి మాలోతు కవిత, BJP నుంచి సీతారాంనాయక్, కాంగ్రెస్ నుంచి బలరాంనాయక్‌లు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బరిలో నిలవనున్న ముగ్గురికి గతంలో ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పోరు ఆసక్తిగా మారింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మళ్లీ 3 రోజులు వరుస సెలవులు రానున్నాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. నేడు, రేపు మాత్రమే మార్కెట్ ఓపెన్ ఉండనుంది. కావున, రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్లో క్రయ విక్రయాలు కొనసాగించాలని అధికారులు సూచిస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం తేజ మిర్చి క్వింటాకి రూ.19,300 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి రూ.16వేలు, వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.15,000 ధర వచ్చింది. మరోవైపు 5,531 మిర్చికి రూ.11,000 ధర, టమాటా మిర్చి 27వేలు, సింగల్ పట్టి రూ.45,000 ధర పలికాయి. కాగా నిన్నటితో పోలిస్తే ఈరోజు టమాటో, 5531 రకాల మిర్చిలు మినహా అన్ని రకాల మిర్చి ధరలు పెరిగాయి.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. నిన్న క్వింటా పత్తి ధర రూ.7,170 పలకగా.. ఈరోజు రూ.7,310కి చేరింది. అలాగే క్వింటా మక్కలు రూ.2,215 పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్థులు తెలుపుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 809 పోలింగ్ కేంద్రాల్లో మొదటి దశ ర్యాండమైజేషన్ ద్వారా 1,338 మంది సిబ్బందిని కేటాయించినట్లు వరంగల్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లో ఎన్ఐసీ రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తూ, ఆన్లైన్లో పోలింగ్ సిబ్బంది మొదటి దశ యాదృచ్ఛికీకరణ ప్రక్రియ నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.