India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాజీపేట రైల్వే స్టేషన్లోని ఒకటో నెంబరు ప్లాట్ ఫాంపై లిఫ్టు వద్ద గుర్తు తెలియని ప్రయాణికుడు మృతి చెందినట్లు జీఆర్పీ అధికారి కమలాకర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో అతను మరణించినట్లు చెప్పారు. అతడి వయసు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, నీలిరంగు చొక్కా, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు.
కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగంలో మొట్టమొదటిసారిగా బ్రెయిన్ ట్యూమర్ చికిత్స చేశారు. హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన బుర్ర స్వరూపకు బ్రెయిన్‌లో ట్యూమర్ ఏర్పడింది. దీంతో ఆమెకు తీవ్రమైన తలనొప్పి, నరాల బాధతో ఆసుపత్రిలో చేరగా న్యూరోసర్జరీ విభాగం హెచ్ఓడీ డా.సికందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సచిన్, వీరేష్ శస్త్రచికిత్స చేశారు.
హోలీ ఉమ్మడి జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. వెంకటాపురం మండలంలో స్నేహితులిద్దరు కాల్వలో స్నానం చేసి బైక్‌పై వస్తూ చెట్టును ఢీకొని మృతిచెందారు. హసన్‌పర్తి మం.లో పలివేల్పుల, గుండ్లసింగారం సమీపంలో SRSP కాల్వలో స్నానాలకు వెళ్లిన ముగ్గురు గల్లంతు కాగా వారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. నర్సింహులపేట మం.లో చెరువులోకి ఈతకెళ్లిన బాలుడు మునిగి చనిపోయాడు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,200 ధర, 341 రకం మిర్చి రూ.15,500, వండర్ హాట్(WH) రకం మిర్చికి రూ.15,000 ధర వచ్చింది. అలాగే 5,531 మిర్చికి రూ.12,000 ధర, టమాటా మిర్చి 30వెలు, సింగల్ పట్టి రూ.41,500 ధర పలికాయి. అలాగే మక్కలు బిల్టీ క్వింటాకు రూ.2200 పలికాయి.
మూడు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు పున: ప్రారంభమైంది. దీంతో మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్‌కు భారీగా పత్తి తరలివచ్చింది. అయితే గత వారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గత వారం క్వింటా పత్తి రూ.7300 కి పైగా పలకగా.. ఈరోజు రూ.7170కి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
నర్సంపేటకు చెందిన ఓ యువతి, తొర్రూరు మండలం చర్లపాలెం వాసి ప్రకాశ్ ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఒప్పుకోని యువతి తండ్రి శ్రీనివాస్.. 5నెలల క్రితం పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించగా ఆ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. కుమార్తెపై అనుమానంతో ఈనెల 24న ఆమె ఫోన్ నుంచి ఇంటికి రావాలని ప్రకాశ్‌కు శ్రీనివాస్ మెసేజ్ చేశాడు. అది నమ్మి ఇంటికి వచ్చిన ప్రకాశ్‌పై దాడి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.
పరకాల మండలం వెంకటాపూర్‌కు చెందిన వెంకటేష్,ఆశ్విత కొడుకు మహాన్(1) తలకు కణితి అయింది. కాగా బాలుడి వైద్యానికి ఆర్థిక స్తోమత లేక ఆ తల్లిదండ్రులుకు ఇబ్బంది పడ్డారు. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా అమెరికాలో ఉంటున్న NRI మేటమర్రి కామేశ్- ప్రతిమ దంపతులు స్పందించి బాలుడి వైద్యానికి రూ.3.50 లక్షల సాయం అందించి పెద్ద మనస్సు చాటుకున్నారు. బాలుడి నిన్న డిశ్చార్జి కాగా దాతలకు పేరెంట్స్ కృతజ్ఞతలు చెప్పారు.
ములుగు మండలం జంగాలపల్లి సమీపంలోని జవహర్ నగర్ గట్టమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారి-163పై సోమవారం రాత్రి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఎంపిక చేసిన రైతువేదికల్లో నేడు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానంపై అఖిల భారత సమగ్ర వ్యవ సాయ పద్ధతుల పరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎం.గోవర్ధన్, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ప్రధాన శాస్త్రవేత్తలు మెళకువలు చెబుతారు.
హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 27, 28 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం ఇన్చార్జ్ హెడ్ డాక్టర్ మాదాసి కనకయ్య సోమవారం తెలిపారు. ‘ఫీన్టెక్ రెవల్యూషన్ రీషెపింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్ ది డిజిటల్ ఏజ్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ తాటికొండ రమేశ్ వస్తారని అన్నారు.
Sorry, no posts matched your criteria.