India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ మధ్యకాలంలో అమ్రాబాద్, కవ్వాల్, తాడ్వాయి, ఇల్లందు తదితర ప్రాంతాల్లో అటవీ ప్రమాదాలు జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ అటవీ ప్రమాదాల వల్ల వన్యప్రాణులతో పాటు విలువైన అటవీ సంపదకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉన్నందున అటవీశాఖతో పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వేసవి మొదలైనప్పటి నుంచి వరుసగా జరుగుతున్న ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖను ఆదేశించారు.
షెడ్యూల్డ్ కులాల అధ్యయన కేంద్రం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 100 మంది అభ్యర్థులకు 2నెలలపాటు ఉచిత వసతి భోజనంతో కూడిన DSC శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లాశాఖ సంచాలకులు డాక్టర్ కె. జగన్ మోహన్ తెలిపారు. దరఖాస్తులను వెబ్సైట్ tsstudycircle.co.in రేపటి లోగా అప్లై చేసుకోవాలని సూచించారు.
రెండు బైకులు ఢీ కొని వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం గణపురం మండలం చెల్పూర్‌లో జరిగింది. పోలీసుల వివరిలిలా .. చిట్యాల మండలం జడలపేటకు చెందిన బోట్ల రమేశ్(30), గణపురం మండలం ధర్మరావుపేటకు చెందిన ప్రేమ్.. ఇద్దరు ఎదురెదురుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా ప్రయాణిస్తున్న బైకులు అదుపుతప్పి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రమేశ్ మృతిచెందారు. తీవ్రగాయాలైన ప్రేమ్‌ను వరంగల్MGM తరలించారు.
హోలీ పండుగ పూట ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం వద్ద (రామప్పకు వెళ్ళేదారిలో) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తిమ్మాపూర్‌కు చెందిన ఉమ్మడి ఉమేష్ (22), లక్ష్మీదేవిపేటకు చెందిన ఎంబడి శృశాంత్ (22)గా స్థానికులు గుర్తించారు.
మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు హోలీ పర్వదినం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం తన అత్త, కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఝాన్సీ రెడ్డితో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా అత్తా కోడళ్లు రంగులు పూసుకున్నారు. అనంతరం పాలకుర్తి ప్రజలకు ఎమ్మెల్యే హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. జిల్లా నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని ఆలయ ఈఓ శేషగిరి తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 60 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 250 మంది పోలీసులతో కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
హన్మకొండ నిట్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని సురేందర్ బైకుపై వెళుతున్నాడు. ఈ క్రమంలో బైకును ఓ కారు ఓవర్ టెక్ చేస్తుండగా ఢీకొంది. ఈ ఘటనలో సురేందర్ అక్కడికిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు ఎంజీఎం మార్చురీకి తరలించారు.
గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. కార్డుపై సహాయకురాలి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, గుర్తింపు కార్డు నెంబర్, సంఘం పేరు ఉండనుంది. ఇప్పటికే వీటి తయారీ పూర్తయ్యిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2600 గ్రామైక్య సంఘాల్లోని ఆయా సంఘాల అధ్యక్షులకు పది రోజుల్లో కార్డులు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
చిన్నా, పెద్ద, ధనిక, పేద, కుల, మత భేదాలు లేకుండా చేసుకునే పండగల్లో హోలీ ప్రధానమైంది. జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ బంధువులు, మిత్రులపై రంగులు చల్లుతూ.. ఆనందోత్సాహాలతో ఈ వేడుక నిర్వహించుకుంటారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సహజ రంగులు కాకుండా రసాయనాలతో చేసిన రంగులు కళ్లు, చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.