India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BJP వరంగల్ MP అభ్యర్థిగా అరూరి రమేశ్ పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించగా.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. అరూరి తొలిసారిగా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి PRP తరఫున పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత BRSలో చేరి 2014, 2018లో వర్ధన్నపేట నుంచి MLAగా గెలిచి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం, గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ (31)లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మొదటి అంతస్తులో ఉన్న కంట్రోల్ రూమ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం అందించడానికి, వివిధ రాజకీయ పార్టీల ప్రచార అనుమతుల నిమిత్తం మీడియా సర్టిఫికేషన్ ఏర్పాటు చేశామన్నారు.
బీజేపీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా ఆరూరి రమేష్ ను పార్టీ అధిష్టానం నియమించింది. 2014, 2018వ సంవత్సరాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరూరి రమేష్ వారం రోజుల క్రితం తన అనుచరులతో కలిసి బిజెపి పార్టీలో చేరారు. మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, ఆరూరి రమేష్ బీఆర్‌ఎస్ నుంచి బీజేపీ పార్టీలో చేరగానే వారికి ఎంపీ టికెట్ లభించింది.
వరంగల్: హోలీ పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రకృతి ప్రసాదించిన రంగులే మన జీవితంలోని పలు దశలను ప్రతిబింబిస్తాయని, భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని పండుగలా ఆస్వాదించాలనే సందేశాన్ని హోలీ పండుగ ఇస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఓరుగల్లు వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెద్దపులి త్వరలో సందడి చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండలోని కాకతీయ జూపార్కులో సిద్ధం చేస్తున్నారు. రూ.60 లక్షల వ్యయంతో ఇక్కడ దీనికోసం ప్రత్యేక ఎంక్లోసర్ సిద్ధమైంది. పులికి నివాసయోగ్యమైన అన్నిసౌకర్యాలు కల్పిస్తున్నారు. అడవి వాతావరణం ఉండటం వల్ల అది స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందని జిల్లా అటవీశాఖ అధికారిణి లావణ్య తెలిపారు.
అనిశాకు చిక్కిన MHBD సబ్ రిజిస్ట్రార్ తస్లీమాకు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జి.ప్రేమలత తెలిపారు. ఈనెల 16న WGL జిల్లాలో ఏసీబీ న్యాయస్థానాన్ని ప్రారంభించగా.. ఏసీబీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన MHBD సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా, పొరుగు సేవల ఉద్యోగి ఎ.వెంకట్‌ను శనివారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించగా పోలీసులు వారిద్దరిని కరీంనగర్ జైలుకు తరలించారు.
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం ముంజలకుంటతండాకి చెందిన రమావత్ వెంకన్న కొత్త ఇంటికి అవసరం నిమిత్తం శనివారం మోటార్‌ను బిగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకన్న కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం MGMకు తరలించారు.
వరంగల్ నగరంలోని కరీమాబాద్ SRR తోట ప్రాంతంలో ఉన్న వాణి విద్యానికేతన్ స్కూల్‌పై వివిధ విద్యార్థి సంఘాలు వినతి పత్రం సమర్పించడంతో డీఈవో వాసంతి స్పందించారు. శనివారం ఆర్జేడీకి ప్రొసీడింగ్ లేఖ పంపించారు. ఒక పర్మిషన్ మీద రెండు బ్రాంచీలు నడిపిస్తున్న వాణి విద్యానికేతన్ పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆర్జేడీకి పంపించారు. ఈ మేరకు AIFDS వామపక్ష విద్యార్థి సంఘాలు డీఈఓకు కృతజ్ఞతలు తెలిపాయి.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు.
> MHBD ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా సుజాత
> > జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు
> > సీఎం రేవంత్‌ను కలిసిన పాలకుర్తి MLA
> > HNK: బాలికపై లైంగికదాడికి యత్నం.. సీఐ సస్పెండ్
> > గాంధీభవన్ వద్ద దేవరుప్పుల కాంగ్రెస్ నాయకుల నిరసన
> దుగ్గొండి: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
> > ములుగు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి సీతక్క
> ములుగు: వదంతులు సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు
Sorry, no posts matched your criteria.