India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. మైసంపల్లి గ్రామానికి చెందిన వెంగళ సుప్రియ శనివారం సాయంత్రం ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉంది. ఇంట్లో ఉన్న బీరువా పగలగొట్టి ఉన్నట్లు, మృతురాలి మెడలోని బంగారం కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. సుప్రియ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సుప్రియకు భర్త కిరణ్, ఇద్దరు పిల్లలున్నారు.
మహబూబాబాద్ DRDOగా పని చేస్తున్న పురుషోత్తంపై సస్పెన్షన్ వేటు పడింది. భూపాలపల్లిలో డీఆర్డీఏ పీడీగా కొనసాగిన సమయంలో రికార్డులను అందజేయకపోవడంపై సమగ్రమైన విచారణ అనంతరం పురుషోత్తం సస్పెండ్ అయ్యారు. డీఆర్డీవోను బాధ్యతల నుంచి తప్పించాలని పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.
మహబూబాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌గా దామల్ల సుజాతను నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటి వరకు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన తస్లీమా మహ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌గా సుజాత విధుల్లోకి రానున్నారు.
బాలికపై లైంగిక దాడికి యత్నించి పోక్సో కేసులో అరెస్టయిన భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ బండారి సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారి బాలికపై అత్యాచారానికి యత్నించినందుకు సంపత్‌పై శాఖపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని ఆయన వెల్లడించారు.
వరంగల్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే ఇక్కడ మాజీ MLA ఆరూరి రమేశ్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురుచూసున్నారు. మీ కామెంట్?
BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆరూరి రమేష్ రాజీనామాతో ఈ పదవి ఖాళీ అవ్వగా.. ఈ పదవిని ఎవరికి ఇస్తారో అని సందిగ్ధం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కార్యకర్తలు, సీనియర్ లీడర్లు చాలామంది పార్టీ ఫిరాయించడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్, పరకాల మాజీ MLA చల్లా ధర్మారెడ్డిలలో ఎవరో ఒకరికి ఈ పదవి రానున్నట్లు సమాచారం.
ప్రేమ పేరుతో బాలిక(15)ను వేధించిన యువకుడి(27)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్ శుక్రవారం తెలిపారు. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈనెల 18న బాలిక ఇంటికి వెళ్లి వేధించడంతో బాలిక తల్లి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈమేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పర్వతగిరి మండలం తురకల సోమారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఇంటి పెరట్లో మొరంగడ్డ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా 5-8 అంగుళాల సైజు ఉండే ఈ మొరంగడ్డ ఏకంగా 2 అడుగుల పొడవు, రెండున్నర కిలోల బరువుతో అబ్బుర పరుస్తుంది. కాగా, గత కొంతకాలంగా వెంకటేశ్వర్లు తన ఇంటి ఆవరణలో కూరగాయలను పండిస్తున్నారు. వాటితో పాటు మొరంగడ్డ నాటారు. దానిని తవ్వి చూడగా.. భారీ పరిమాణంలో ఉండటంతో ఆశ్చర్యపోయారు.
ACB దాడులతో ఉమ్మడి WGL జిల్లాలోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. లంచం తీసుకుంటుండగా ముగ్గురు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తహశీల్దారును అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, తొలిసారిగా KUలో ఉద్యోగిని పట్టుకున్నారు. శుక్రవారం MHBD జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.
*MHBD జిల్లాలో 2018 మార్చిలో పోలీస్ స్టేషన్లో ఓ SI బాధితుడి నుంచి రూ.14 వేలు లంచం తీసుకుంటూ.. ACBకి దొరికాడు.
*2019లో నర్సింహులపేట MPDO రూ.35 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
*2021లో SC సంక్షేమ శాఖకు చెందిన అభివృద్ధి అధికారి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికాడు.
*జిల్లా పరిశ్రమల శాఖ అధికారి లోన్ మంజూరు కోసం రూ.7 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు.
* తాజాగా సబ్ రిజిస్టర్ పట్టుబడడం సంచలనంగా మారింది.
Sorry, no posts matched your criteria.