India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆటో బోల్తాపడి నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సీరోల్ మండలంలోని కందికొండ స్టేజ్ వద్ద ఎదురుగా వస్తున్న మరో ఆటోను తప్పించబోయి ఆటో బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కురవికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన 108లో ఆసుపత్రికి తరలించారు.
పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోని ఇండ్ల ముందు కుండలు, పసుపు కుంకుమతో పాటు క్షుద్రపూజల సామాగ్రి పెట్టి ఉండటంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామానికి చెందిన సదన్ కుమార్, రమేష్ ఇద్దరి ఇంటి ముందు ఇవి ప్రత్యక్షమయ్యాయి. తమకు క్షుద్ర పూజలు చేసినట్లు, తమకు ప్రాణహాని ఉందని బాధితులు తెలిపారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వరంగల్ జిల్లా సంగెం మండల ఎంపీపీ కందగట్ల కళావతి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మండలంలోని ఎంపీటీసీలు అందుకు సంభందించిన తీర్మాన పత్రాన్ని శుక్రవారం వరంగల్ ఆర్డీవో సీదం దత్తుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో వివిధ హోదాలలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికార దాహంతో పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకోవడంతోనే ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయ అధికారి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సాంఘీక సంక్షేమ గురుకుల వెబ్ సైట్ tswreis.inలో పరిశీలించాలని కోరారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గురువారం (నిన్న) క్వింటా పత్తికి రూ.7,315 ధర రాగా.. ఈరోజు (శుక్రవారం) రూ.7250 కి పడిపోయింది. ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. రేపటినుండి మార్కెట్ కు వరుసగా మూడు రోజుల వరుస సెలవులు నేపథ్యంలో ఈరోజు పత్తి తరలివచ్చింది.
వరంగల్ జిల్లా యువతకు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే వరంగల్‌లో క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. హెచ్‌సీఏ నిర్ణయంపై వరంగల్ జిల్లా యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హనుమకొండ ఠాణా పరిధి కిషన్ పురలో వాచ్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నడికూడ మండలం చర్లపల్లికి చెందిన రాజేందర్(45) కిషన్ పురలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్నాడు. వారం క్రితం భార్యాభర్తలమధ్యలో ఘర్షణ జరిగింది. దీంతో రాజేందర్ భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన అతను గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకున్నాడు.
కేసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల సాంబయ్య, వీరన్న అనే కానిస్టేబుల్స్ ఇసుక లారీ డ్రైవర్‌ను ఘోరంగా కొట్టారు. ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన రఘునాథపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కార్తీక్ (28) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పనులు దొరకకపోవడంతో కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన రెండో జాబితాలో WGL లోక్‌సభ అభ్యర్థి పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఆశావహులు, ఎవరికి వారు టికెట్ తమకే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి లోకసభ ఎన్నికల్లో ఆశించిన మేరకు సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. కాగా, కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.