India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీను మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆయన మృతదేహానికి తనతో పాటు విధులు నిర్వహించిన పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు నివాళులర్పించారు. అనంతరం శ్రీరాముల మృతికి కారణమైన సీఐ, కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధుమిత్రులు డిమాండ్ చేశారు.
ఆత్మహత్యాయత్నం చేసిన అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ మరణ వార్త విన్న ఆయన మేనత్త రాజమ్మ గుండెపోటుతో మృతి చెందింది. WGL జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన రాజమ్మకు ఆదివారం గుండెపోటు రాగా వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే రోజున ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన వెంకటాపురం మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శాంతినగర్ గ్రామానికి చెందిన తాటి కావ్యశ్రీ(10) అనే బాలిక శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న క్రమంలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిందని తెలిపారు.
జనగామ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఎర్రయ్య(96) శనివారం ఉదయం మృతి చెందారు. దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఎర్రయ్య.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. తొలి గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచిగా ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత మరో రెండు సార్లు సర్పంచిగా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీరాజ్ సమక్షంలో మంత్రులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉచితంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వారం రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పారు.
బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పట్ల తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఆరాధనకు, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక తత్వానికి బోనాల ఉత్సవాలు నిదర్శనంగా నిలుస్తాయని మంత్రి చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, వైభవాన్ని బోనాలు జగద్వితం చేశాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు.
కేయూ పరిధిలో డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. MAY నెలలో 2, 4, 6 సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. శనివారం ఆరవ సెమిస్టర్ ఫలితాలను KU అధికారులు విడుదల చేయగా 2, 4వ సెమిస్టర్ ఫలితాలు మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసంhttps://www.kuonline.co.in/Result/RS_6TH_MAY2024.aspx ఈ లింక్‌ను క్లిక్ చేయాలని సూచించారు. ఈనెల 22 వరకు రివాల్యుయేషన్‌కు అవకాశం కల్పించారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం ఘటనలో అక్కడి CI జితేందర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్ఐ సతీమణి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. కాగా ఆత్మహత్యకు యత్నించిన ఎస్సై ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గుప్త నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా కరీమాబాద్ బొమ్మల గుడిలో అమ్మవారికి మొదటి రోజు లక్ష పూలతో పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బారులు తీరారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని రాష్ట్ర ప్రజలు శుభసూచకంగా చూస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల వలె విభజన హామీల పరిష్కారం కాని అంశాల పరిష్కారం కోసం చర్చ జరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ అర్ధం అవుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.