Warangal

News June 24, 2024

జనగామ: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

image

జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో వర్షిణి(14) అనే 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఈనెల 21న పాఠశాలలో చేర్పించారు. అక్కడి వాతావరణం నచ్చకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News June 24, 2024

తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టనున్న కడియం కావ్య

image

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య తొలిసారి అడుగుపెట్టనున్నారు. అనంతరం ఎంపీగా కడియం కావ్య ప్రమాణ స్వీకారం చేస్తారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో ఎంపీ కడియం కావ్య గళం విప్పుతారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News June 24, 2024

జనగామ: వివాహేతర సంబంధం.. ఆపై హత్య

image

వివాహేతర సంబంధం పెట్టుకొని ఆపై మహిళను హత్య చేసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. సుబేదారి CI వివరాల ప్రకారం.. స్టే.ఘ వాసి మంజులకు, HNK వాసి అశోక్‌తో పెళ్లైంది. కాగా వీరి మధ్య గొడవలు రావడంతో సర్దిచెప్పడానికి వచ్చిన పంచాయితీ పెద్ద మనిషి వెంకటస్వామి ఆమెను లొంగదీసుకొని 2ఏళ్లగా సహజీవనం చేస్తున్నాడు. ఈనెల 21న మంజుల, వెంకటస్వామి ఫోన్‌లో గొడవ పడ్డారు. దీంతో ఆమెను హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

News June 24, 2024

రక్తంతో MLA యశస్వినిరెడ్డి చిత్రాన్ని గీసిన యువకుడు

image

దేవరుప్పుల మండలానికి చెందిన యువకుడు లోడంగి అశోక్ తన రక్తంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చిత్రాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యేకు చిత్రపటాన్ని అశోక్ అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

News June 24, 2024

కేయూ పరిధిలో నేటి నుంచి పరీక్షలు

image

కేయూ బీఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలు నేటి(సోమవారం) నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 24, 26, 28, జులై 1వ తేదీల్లో నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.

News June 23, 2024

మహబూబాబాద్: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

మహబూబాబాద్ జిల్లాలో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ 420/20-22 KM రాయి వద్ద రైలు కింద పడి కిష్టాపురం గ్రామానికి చెందిన కొంగరి సునీల్(34) మృతి చెందినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. బంధువులకు సమాచారం ఇచ్చి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 23, 2024

పాలకుర్తి: ఇక్ష్వాకుల కాలం నాటి నాణెం లభ్యం

image

జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివారులోని పాటిగడ్డమీద తండాలో ఓ పురాతన నాణెం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. ఇక్ష్వాకుల కాలంలో ముద్రించిన ఈ నాణెంపై గుర్రం గుర్తుతో పాటు అర్ధ వృత్తాకారం బ్రహ్మలిపిలో ఉందని చరిత్రకారుడు రత్నాకర్ రెడ్డి తెలిపారు. గుర్రం గుర్తు ఉన్న వీటిని ‘మహా తలవర నాణేలు’ అంటారని పేర్కొన్నారు.

News June 23, 2024

ములుగు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

image

ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లిలో శనివారం రాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన అచ్చ లక్ష్మీనర్సయ్య- తిరుమల దంపతులు ఏప్రిల్ 6న ఏటూరునాగారం మండలంలో గృహం నిర్మించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. కాగా అదే ఆహ్వానం కార్డుతో వారంటే గిట్టని వారు గ్రామంలో గృహప్రవేశం ఆహ్వాన కార్డుకు నల్ల కోడి, కోడిగుడ్డు, గుమ్మడి, మిరపకాయలు, బొమ్మలు తదితర వస్తువులు పెట్టి పూజలు చేశారు.

News June 23, 2024

BHPL: అనుమానాస్పదంగా ఉరేసుకొని వ్యక్తి మృతి

image

జయశంకర్ ​భూపాలపల్లి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉరేసుకొని మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని సుభాశ్ కాలనీలో జరిగింది. మృతదేహం కుళ్లిపోయి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు కొండపర్తి శివగా పోలీసులు గుర్తించారు.

News June 23, 2024

వరంగల్: 19 మంది CIల బదిలీ

image

మల్టీ జోన్ 1 పరిధిలో పని చేస్తున్న 19 మంది CIలను బదిలీ చేస్తూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏవి.రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని భూపాల్ పల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌లు బదిలీ అయ్యారు.