India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దివ్యాంగులు, వయోవృద్ధులు స్పెషల్ గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హైమావతి తెలిపారు. ప్రతి నెల నాలుగో శనివారం వరంగల్ కలెక్టరేట్‌లో ప్రత్యేక ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
లేగ దూడను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని మరిపెడ మండలంలోని స్టేజి తండా వద్ద గిరిజనులు బస్సును అడ్డుకున్నారు. లేగ దూడను బస్సుకు కట్టేసి బస్సు ముందుకు పోకుండా ఆపేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లేగ దూడకు పెద్దగా గాయాలు తగలకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది గిరిజనులకు నచ్చజెప్పగా ఆందోళనను విరమించి బస్సును ముందుకు వెళ్లేందుకు సహకరించారు.
ఆర్టీఏలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ అసిస్టెంట్ సురేశ్ విధుల్లో నిర్లక్ష్యంగా మద్యం తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సదరు ఉద్యోగి సురేశ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహించకుండా బ్లాక్ లిస్టులో ఉంచామన్నారు.
పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3000 జరిమాన విధిస్తూ హనుమకొండ జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామానికి చెందిన ముత్యాల హనుమంతు 2017 సెప్టెంబర్ 13న దివ్యాంగుల పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక ఆడుకుంటుండగా ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశించిన ప్రజాస్వామిక తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే జీవిత లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పోరాటం చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు.
త్వరలోనే మహిళలకు రూ.2500 అందజేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అంశంపై అధికారులతో మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు. మహిళల స్వయం సమృద్ధి, సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, మహిళలు అని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని సీతక్క అన్నారు.
వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలో ఆయన మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. నగరాభివృద్ధికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన మధుకి రూ.80వేల సీఎం సహాయనిది చెక్కు మంజూరు అయింది. అందుకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే ఈరోజు లబ్ధిదారు కుటుంబానికి తన కార్యాలయంలో అందించారు.
రీల్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణం తీసుకున్న ఘటన WGL జిల్లా నర్సంపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సంపేటకు చెందిన కందికట్ల అజయ్(23) ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే అలవాటు ఉన్న అజయ్ రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరి వేసుకుంటూ ఫోన్‌లో వీడియో తీసుకునే క్రమంలో మెడకు ఉరి పడి మృతి చెందాడు. నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడని మొదట భావించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి ఎస్సీ కాలనీలో క్షుద్ర పూజలకు సంబంధించిన పసుపు, కుంకుమ, బియ్యం కలిపిన ఆకులు కొందరి ఇంటి ఎదుట పెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. క్షుద్ర పూజలకు పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.