India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొంత మంది కావాలనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారని, నేను పార్టీ మారడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌కు మళ్లీ పూర్వ వైభవం రానుందని తెలిసి అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ వాళ్లు ఇలాంటి పనికిమాలిన ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు. నేను పార్టీ మారడం లేదని, బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ పార్టీ పూర్వ వైభవం కోసం పని చేస్తానన్నారు.
నల్లబెల్లి మండల వాసి వైష్ణవి(26) <<13467198>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. SI రామారావు వివరాల ప్రకారం.. వైష్ణవిని ములుగు(D) వెంకటాపురం వాసి శంకర్‌తో MAR 22న పెళ్లయింది. 2 నెలలకే భర్తకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించిన వైష్ణవి అత్తమామకు, మరుదులకు తెలిపింది. శంకర్ తీరులో మార్పు రాలేదు. వైష్ణవిని ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో 18న పుట్టింటికి వచ్చిన ఆమె.. బుధవారం ఉరేసుకుంది. కేసు నమోదైంది.
ఓ మహిళా కానిస్టేబుల్ పై <<13467989>>కాళేశ్వరం <<>>SI బావానీసేన్ లైంగిక వేధింపుల కేసులో డిస్మిస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈయన కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం SIగా ఉన్నప్పుడు కానిస్టేబుల్ పుస్తకాలు కొనిస్తానని, కొచింగ్ ఇప్పిస్తానని చెప్పి యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు. కాళేశ్వరం SIగా వచ్చిన తర్వాత ప్రధానంగా ఆయన దృష్టి కొందరి మహిళలపై పడింది.
జనగామ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్‌లతో అంగన్వాడీ కేంద్రాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల నమోదు శాతం పెరగాలన్నారు. కొత్తగా పిల్లల నమోదును పెంచాలని సూచించారు.
AICC మాజీ జాతీయ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీని ఢిల్లీలోని వారి నివాసంలో పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఝాన్సి రాజేందర్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ కావాలని MLA ఆకాంక్షించారు. ఢిల్లీ పర్యటన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో కాసేపటి క్రితం పోస్ట్ చేశారు.
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
> గంజాయి పట్టివేత కేసులో ఇద్దరికీ పదేళ్ల జైలుశిక్ష
> ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసిన పాలకుర్తి MLA యశస్విని
> కన్నాయిగూడెం: జెసిబి తిరగబడి డ్రైవర్ మృతి
> ములుగులో జాబ్ మేళా నిర్వహణ
> WGL: డిసిపిలుగా బాధ్యతలు చేపట్టిన సలీమా, రాజమహేంద్ర నాయక్
> తాడ్వాయి: పురుగు మందు తాగి బాలిక సూసైడ్
> కాలేశ్వరం ఎస్సై భవాని సేన్ పై కేసు నమోదు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన అంకిత(15) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్థులు, కుటుంబీకుల వివరాల ప్రకారం.. అంకిత ఇంట్లో ఉంటూ మొబైల్ ఫోన్లో వీడియోలు చూస్తూ, తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండగా తల్లి గమనించి పలుమార్లు మందలించింది. దీంతో అంకిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌గా విజయభాను బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని చార్మినార్ డివిజన్ డిప్యూటీ ఆర్.ఎంగా పనిచేసిన విజయభాను పదోన్నతిపై వరంగల్ ఆర్.ఎంగా బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన శ్రీలత రంగారెడ్డి ఆర్.ఎంగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన విజయభానును ఆర్టీసీ అధికారులు, కార్మిక నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఇకనుంచి ప్రతి బుధవారం ఓపెన్ ఉండనుంది. ఎండాకాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మూడు నెలల క్రితం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రతి బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. ఇక ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆ సెలవులు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విషయాన్ని రైతులు గమనించి బుధవారం సైతం మార్కెట్‌కు సరుకులు తీసుకొని రావచ్చన్నారు.
పురుగు మందు తాగి ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో జరిగింది. స్థానికుల ప్రకారం.. తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన అంకిత(15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. అప్పుడే వచ్చిన కుటుంబీకులు గమనించి ములుగు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కాగా, అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.