India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ రాజీనామాతో WGL BRSకు సారథి లేకుండా పోయింది. WGL తూర్పు నియోగజకవర్గంలోని పలువురు కీలక నేతలు, కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. మాజీ MLA నరేందర్ సైతం ఎన్నికల అనంతరం స్తబ్దుగా ఉండిపోవడంతో జిల్లాలో సమస్యలు వస్తే చెప్పుకోవడానికి నాయకుడికోసం వారంతా ఎదురు చూస్తున్నారు. దీంతో మాజీ MLAలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి వైపు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
ములుగు జిల్లాలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ( డిఎల్ఎస్ఎ)లో మూడు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆఫీస్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, ఏదేని డిగ్రీతో పాటు టైపింగ్‌లో అనుభవం ఉండాలన్నారు.
జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలో జరిగింది. మద్దూరు ఎస్సై షేక్ యూనస్ అహ్మద్ అలీ తెలిపిన వివరిలిలా.. కూటిగల్ గ్రామానికి చెందిన తిగుళ్ల రమేశ్ (21) జీవితంపై విరక్తి చెంది వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన BRS గ్రామ కమిటీ నాయకుడు జనగాం నారాయణ గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పని నిమిత్తం బయటకు వస్తున్న నారాయణ రోడ్డుపై అకస్మాతుగా కుప్పకులాడు. అది గమనించిన గ్రామస్థులు అతనికి ఫిట్స్ వచ్చిందేమొనని తాళాల గుత్తి అతని చేతిలో పెట్టారు. కాగా అప్పటికే నారాయణ మృతిచెందినట్లు వారు గుర్తించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి సోమవారం తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్లాస్టరింగ్ పనులకు జర్మనీలో డిమాండ్ ఉందన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
లోకసభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక BLOలను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో http:///ceotelangana.nic.in లేదా http:///voters.eci.gov.in అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ తన సొంతూరు చల్లగరిగేలో గ్రంథాలయం నిర్మాణం చేపట్టారు. పురస్కారానికి గుర్తుగా తన సతీమణి సుచిత్ర ఆలోచన మేరకు గ్రామంలోని గ్రంథాలయాన్ని ఆంగ్ల అక్షరం ‘O’ ఆకారంలో రెండంతస్తుల్లో నిర్మిస్తున్నారు. 80శాతం పనులు పూర్తి అయ్యాయి. మరికొద్ది రోజుల్లో గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పలు రకాల సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకి రూ.19,400 ధర పలకగా, 341 రకం మిర్చి రూ.16వేల ధర పలికింది. అలాగే వండర్ హాట్ (WH) రకం మిర్చికి రూ.17వేల ధర రాగా, 5531 మిర్చికి రూ.13వేల ధర, టమాటా రకం మిర్చికి రూ.37,000 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన నాగరాజు, గణపురం గ్రామానికి చెందిన శ్రావణి ప్రేమించి ఈ నెల 12న పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు 14న శాయంపేటకు పోలీసులను సంప్రదించగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈక్రమంలో 16న బంధువులు నాగరాజు ఇంటికి వెళ్లి దాడి చేశారు. దీంతో శ్రావణి ఫిర్యాదు చేయగా దాడి చేసిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. వరంగల్ జిల్లాలో 253 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 43,325 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
Sorry, no posts matched your criteria.