India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చిన్నపెండ్యాలకు చెందిన శాగ శ్రీనివాస్ అప్పటి మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1989-90లో పదో తరగతి చదువుకున్నారు. ఆయన ఇటీవల మల్కాపూర్ పాఠశాలకు గెజిటెడ్ హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులైన ఇల్లందుల సుదర్శన్, జనగాం యాదగిరి మాట్లాడుతూ.. చదువుకున్న పాఠశాలకు హెచ్ఎంగా ఉద్యోగం రావడం అభినందనీయమన్నారు.
మూడు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. ఈ క్రమంలో పత్తి భారీగా తరలి రాగా.. శుక్రవారంతో పోలిస్తే ధర తగ్గింది. శుక్రవారం రూ.6,900 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.6,850కి పడిపోయింది. దీంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఎన్పీడీసీఎల్ అధికారులు సోమవారం ‘విద్యుత్ ప్రజావాణి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 16 జిల్లాల్లోని సర్కిల్ కార్యాలయాల నుంచి కింది స్థాయి సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యుత్ సంబంధిత అంశాలు, సమస్యలపై తొలి రోజు 362 ఫిర్యాదులు వచ్చాయి.
వరంగల్ జిల్లాలోని విద్యార్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 23 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు www. iihtfulia. ac.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైట్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 30 వరకు https://deecet.cdse.telangana.gov.in/వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
ప్రేమ పేరుతో బాలికను నమ్మించి అత్యాచారం చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాజీపేట పోలీసులు తెలిపారు. భట్టుపల్లికి చెందిన రాజారపు ఉమేశ్, కాజీపేటకు చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి గతేడాది HYD తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఉమేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై నవీన్ కుమార్ పేర్కొన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శన వేళలను పునరుద్ధరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పుల వల్ల భక్తులు, అర్చకులు సిబ్బంది సౌకర్యార్థం మార్పులు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 4 గంటల వరకు విరామ సమయంగా నిర్ణయించారు. ఉదయం 6:30 గంటల నుంచి 1:30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులు దర్శనాలు వివిధ పూజలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తాను పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటానని తమ గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని కవి అందె శ్రీ అన్నారు. శనివారం తన స్వగ్రామమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం రేబర్తి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల అవసరాలను, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందెశ్రీ రాసిన గేయం జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించిన సందర్భంగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. తొర్రూరు మండలం మడిపల్లిలో పిచ్చికుక్కల దాడిలో నెలరోజుల పసికందు మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తున్న 42 రోజుల బాబుపై కుక్కదాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు. తల్లి వంట చేస్తూ ఆదమరిచి ఉన్నప్పుడు కుక్క దాడి చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈనెల 19న ములుగు జిల్లాలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. జాబ్ మేళాలో 58 కంపెనీలు పాల్గొంటాయని, 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు, వృత్తి విద్య కోర్సులు చేసిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి వెంటనే ఉద్యోగాల్లో చేర్చుకోవడం జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు.
Sorry, no posts matched your criteria.