India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున:ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు, నేడు బక్రీదు పండుగ కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
నకిలీ ఐడీలతో ఇన్‌స్టాగ్రాంలో సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. శంభునిపేటకు చెందిన ఉపాధ్యాయుడు నీలం రాజు సెల్‌ఫోన్‌లోని ఇన్‌స్టాగ్రాం యాప్‌నకు నకిలీ ఐడీల ద్వారా అసభ్య సందేశాలు పంపిస్తూ..15 రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాజుకు సంబంధించిన ఫొటోలు మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు పంపిస్తూ రూ.30 వేలు ఇస్తే సందేశాలు ఆపుతామంటూ డిమాండ్ చేస్తున్నారు.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన జీవితంలో గేమ్ ఛేంజర్ అత్తయ్య విజయలక్ష్మినే అని WGL కలెక్టర్ డా.సత్య శారదాదేవి అన్నారు. తాను పరిశోధనల్లో ఉన్నపుడు.. ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాలు రాయాలని అత్తయ్యే సూచించారని చెప్పారు. HYDకు చెందిన ఈమె HCUలో జెనెటిక్స్‌లో పీహెచ్‌డీ, CCMBలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పని చేశారు. అనంతరం గ్రూప్-1 రాసి ప్రభుత్వ సర్వీసులోకి వచ్చారు. కలెక్టర్ భర్త వరప్రసాద్ HYD సిటీ కాలేజీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్.
మహబూబాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. బయ్యారం మండలం కోటగడ్డలో ప్రేమికులు ప్రవళిక, రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రవళిక ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలుసుకున్న రవీందర్ కత్తితో గొంతు కోసుకున్నాడు. రవీందర్ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక మృతదేహం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
HYD నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో విద్యా సంవత్సరానికి డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమో కోర్సుల్లో చేరడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాము యాదవ్ తెలిపారు.ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ ద్వారా ఫీజుల్లో రాయితీ కల్పించడానికి ఈ నెల 23న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైనా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
HNK జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(25)పై అదే గ్రామానికి చెందిన యువకుడు (27) అత్యాచారం చేసినట్లు సమాచారం. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. అవివాహితులైన వీరిద్దరూ బంధువులు కావడం గమనార్హం.బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రేటర్ వరంగల్‌లోని కాశీబుగ్గ కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్‌కు చెందిన అద్దెలు ఇద్దరు వ్యక్తులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆదివారం పోలీసులు విచారణ చేపట్టారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. మాజీ కార్పొరేటర్లు ఓని భాస్కర్, అంబి సాంబరాజు, కాంగ్రెస్ నాయకులు దాసరి రాజేశ్, కూచన రవీందర్ తదితరులను పోలీసు స్టేషన్‌కి పిలిపించి విచారించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ఈ పరీక్షకు మొత్తం 4,730 మంది అభ్యర్థులకు గాను ఉదయం 2,637 హాజరయ్యారు. అంటే 55.75 %, మధ్యాహ్నం 2,614 అంటే 55.26 % మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో యుపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగినట్లు తెలిపారు.
భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో స్నానానికి దిగిన యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం..
వరంగల్ పట్టణానికి చెందిన గరికపాటి అఖిల్(19) ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక జాలరు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో విషాదం జరిగింది. గూగులోతు దేవేందర్ అనే రైతు తన వ్యవసాయ పొలంలో మోటర్ వద్ద వైర్లు సరిచేస్తుండగా.. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.