Warangal

News June 16, 2024

జనగామ: ఎలుగుబంటి ఆనవాళ్లు కలకలం

image

జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలంలో ఎలుగుబంటి ఆనవాళ్లు కలకలం రేపాయి. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబండ శివారులో ఎలుగుబంటి గత రాత్రి ఓ పెద్ద గుంత తవ్విందన్నారు . కాగా ఆ తవ్వకాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని పట్టుకోవాలని స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థులు కోరుతున్నారు.

News June 16, 2024

లింగాల ఘనపూర్: యువతిపై కిడ్నాప్‌కు యత్నం

image

ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసేందుకు యత్నించి.. విఫలమై కారులో పారిపోయిన ఘటన లింగాల ఘనపూర్ మండలం పటేలుగూడెం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్థులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి పత్తి గింజలు నాటేందుకు పొలానికి వెళ్తుండగా ఓ వ్యక్తి కారులో వచ్చి యువతిని లాక్కెళ్లాడు. యువతి కేకలు వేయడంతో వదిలిపెట్టి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 16, 2024

నిరాశతో వెనుదిరుగుతున్న బొగత సందర్శకులు!

image

ములుగు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాజేడు మండలం బొగత జలపాతం నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోందని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పర్యాటకులను ఆకట్టుకునే జలపాతం వేసవిలో బోసి పోతుందంటున్నారు. జలపాతానికి ఎగువన ఉన్న చెక్ డ్యాం మరమ్మతులకు గురై నీరు నిలవడం లేదు. దీంతో సందర్శనకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు.

News June 16, 2024

వరంగల్: నేడు 144 సెక్షన్ అమలు

image

సివిల్ ప్రిలిమ్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి సీపీ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News June 15, 2024

వరంగల్: రేపు 144 సెక్షన్ అమలు

image

సివిల్ ప్రిలిమ్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి సీపీ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.

News June 15, 2024

పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టుల వివరాలు

image

పట్టుబడిన మావోయిస్టుల వివరాలు:
1) కారం భుద్రి @ రీతా D/o విజ్ఞాలు, వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యుటీ కమాండర్.
2) సోడి కోసి @ మోతే D/o అడమాలు . పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు,
3) సోడి విజయ్ @ ఇడుమ S/o జోగ, 1 బెటాలియన్ సభ్యుడు,
4) కుడం దస్రు S/o గంగ, మిలిషియా సభ్యుడు
5) సోడి ఉర్ర s/o గంగయ్య, మిలిషియా సభ్యుడు
6) మడకం భీమ S/o కోస, మిలిషియా సభ్యుడు.

News June 15, 2024

వరంగల్: ఆర్టీసీ RM శ్రీలత బదిలీ

image

వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జాస్తి శ్రీలత బదిలీ అయ్యారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు పలువురు అధికారులను బదిలీ చేయగా.. ఇందులో వరంగల్ ఆర్ఎం శ్రీలతను హైదరాబాద్ జోన్‌లోని రంగారెడ్డి జిల్లా RMగా బదిలీ చేశారు. ఆమె స్థానంలో హైదరాబాద్ చార్మినార్ డివిజన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఓ)గా పని చేస్తున్న విజయభాను పదోన్నతిపై వరంగల్ RMగా బదిలీ అయ్యారు.

News June 15, 2024

మహబూబాబాద్: 22న HCA టాలెంట్ హంట్

image

ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తోందని మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఛార్జి అజయ్ సారథి ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు నేటి నుంచి తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలన్నారు.

News June 15, 2024

మహబూబాబాద్: 22న HCA టాలెంట్ హంట్

image

ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తోందని మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఛార్జి అజయ్ సారథి ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు నేటి నుంచి తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలన్నారు.

News June 15, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బదిలీ అయిన కలెక్టర్లు వీరే

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలలో 4 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు.. 
✾ హన్మకొండ నూతన కలెక్టర్‌గా ప్రావీణ్య
✾ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా రాహుల్ శర్మ 
✾ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్  
✾ వరంగల్ కలెక్టర్‌గా సత్యశారదా దేవి