Warangal

News June 27, 2024

రేపు మేడారం హుండీల లెక్కింపు

image

మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల హుండీల లెక్కింపును రేపు గురువారం ప్రారంభించనునట్లు మేడారం ఈవో రాజేంద్రం తెలిపారు. పూజారులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారుల భారీ బందోబస్తు నడుమ మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

News June 26, 2024

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్

image

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం డోర్నకల్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే చర్చించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

News June 26, 2024

హనుమకొండ: మామను చంపిన అల్లుడికి జీవితఖైదు

image

మామను గొడ్డిలితో నరికి చెరువులో పడేసిన అల్లుడికి జీవితఖైదు విధిస్తూ HNK జడ్జి అపర్ణాదేవి తీర్పుచ్చారు. నడికూడ (M) కంఠాత్మకూరు వాసి ఎల్లయ్య(55)తన కుమార్తె స్వాతిని వెంకటేశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 2020 OCT 6న ఎల్లయ్య, వెంకటేశ్ హసన్‌పర్తి చెరువుకట్టపైకి కల్లు తాగడానికి వెళ్లారు. ఈక్రమంలో వారి మధ్య గొడవ జరగగా వెంకటేశ్ గొడ్డలితో నరికి మృతదేహాన్ని చెరువుతో పడేశాడు.

News June 26, 2024

భూపాలపల్లి: భార్యను హత్య చేసిన భర్త

image

భూపాలపల్లి జిల్లా మల్హర్(M)లో ఓ మహిళను <<13508723>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని అనుసాన్‌పల్లి వాసి సుమత(30), ఆకుదారివాడ వాసి హతిరాంకు పెళ్లైంది. భర్త వివాహేతర సంబంధం కారణంగా తరచూ ఇద్దరికి గొడవలు జరిగేవి. ఈక్రమంలో మంగళవారం ఆమెను చున్నీతో ఉరేసి చంపి, ఒంటిపై ఉన్న బంగారం తీసుకొని ఎవరో హత్య చేసినట్లు చిత్రీకరించాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు CI నరేశ్ కేసు నమోదు చేశారు.

News June 26, 2024

WGL: రాహుల్ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

image

పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. దేశ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకై పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సత్తా రాహుల్ గాంధీకి ఉందన్నారు. భారత్ జోడోయాత్రతో దేశ ప్రజల్లో రాహుల్ గాంధీ సమైక్యతను నింపారన్నారు.

News June 26, 2024

రక్షిత మంచి నీటిని అందించేందుకు నిధులు కేటాయించాలి: సీతక్క

image

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌తో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద 10 లక్షల గృహాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 53.98 లక్షల గృహాలకు రక్షిత మంచినీరు అందుతుందన్నారు. కొత్తగా ఏర్పాటైన ఆవాసాలకు, కొత్తగా నిర్మించిన గృహాలకు నల్లాల ద్వారా మంచినీటి సరఫరాకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

News June 26, 2024

ప్రాథమిక విద్య కేంద్రాలుగా అంగన్వాడీలు: వాకాటి కరుణ

image

పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ప్రాథమిక విద్య అందించాలని ప్రభుత్వం అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందన్నారు.

News June 25, 2024

భూపాలపల్లి జిల్లాలో మహిళ హత్య

image

భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఫకీర్ గడ్డాలో ఇస్లావత్ సుమతిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News June 25, 2024

HNK: ఈనెల 29 నుంచి వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్

image

కాకతీయ విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహాచారి, అదనపు నియంత్రణ అధికారి డా.రాధిక విడుదల చేశారు. మొదటి పేపర్ జూన్ 29న, రెండో పేపర్ జులై 1న, మూడో పేపర్ 3న, నాలుగో పేపర్ 5న ఉన్నట్లు తేలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

News June 25, 2024

తొర్రూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

తొర్రూరు డివిజన్ పరిధిలోని మడిపల్లి శివారులోని అకేరు వాగు సమీపంలో తొర్రూరు-నెల్లికుదురు రోడ్డు పై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తొర్రూరులోని అమృత బ్రెడ్ ట్రాన్స్ పోర్ట్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడు చెర్లపాలెం గ్రామానికి చెందిన హనుమండ్ల సుధాకర్ రెడ్డి‌గా గుర్తించారు.