India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలికను వేధించిన నిందితుడికి 2ఏళ్ల శిక్ష విధిస్తూ HNK అదనపు కోర్టు జడ్జి అపర్ణాదేవి తీర్పిచ్చారు. ధర్మసాగర్(M) వాసి ఓ బాలికను బంధువైన దిలీప్ ప్రేమిస్తున్నానని వేధించేవాడు. 2018 APL29న బాలికకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని బెదిరించడంతో ఇంటి నుంచి వెళ్లింది. బాలిక తండ్రి PSలో ఫిర్యాదు చేయడంతో దిలీప్ ఆమెను ఇంటికి పంపించాడు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. ఈ నెల 30 వరకు సంబంధిత వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు 45 శాతం, ఇతరులు 50 శాతం అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు.
NPDCL కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నోడల్ ఆఫీసర్లు, సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. సోమవారం ఈ కాన్ఫరెన్స్‌లో సీఎండీ మాట్లాడుతూ.. బ్రేక్ డౌన్, ట్రిప్పింగ్‌లు జరిగినప్పుడు ప్రతి చోట ప్రత్యామ్నాయ సరఫరా ఉండేటట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ నగరంలో ఈ నెల 28న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కుడా పరిధిలో చేపట్టబోయే అండర్ డ్రైనేజీ పనులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
చెరువులో చేపల వేటకు దిగిన వ్యక్తిపై మొసలి దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో జరిగింది. గ్రామానికి చెందిన మురళి పాకాల చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మొసలి అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో మురళికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మురళి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లాలో 632 (85.29 %) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. హనుమకొండ 8,856 (69.77%), భూపాలపల్లి 521 (68.23%), మహబూబాబాద్ 1,301 (63.56%), జనగామ 1,167 (61.95%), వరంగల్ 1,857 (58.66%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లోనూ వరంగల్ చివరి స్థానంలో నిలిచింది.
ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లాలో 189 (81.47 %) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. భూపాలపల్లి 302 (71.23%), జనగామ 693 (56.02%), హనుమకొండ 2,672 (54.12%), మహబూబాబాద్ 601 (50.76%), వరంగల్ 1,029(46.33%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో వరంగల్ చివరి స్థానంలో నిలిచింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో రాష్ట్రంలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లాలో 85.29 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.. ములుగు జిల్లా వ్యాప్తంగా 741 మంది పరీక్ష రాయగా.. 632 మంది పాసయ్యారు. 423 మంది బాలురకు గాను 352 మంది(83.22) పాసవ్వగా.. 318 మంది బాలికలకు గానూ 280 మంది(88.05శాతం) పాసయ్యారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో వర్షిణి(14) అనే 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు ఈనెల 21న పాఠశాలలో చేర్పించారు. అక్కడి వాతావరణం నచ్చకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య తొలిసారి అడుగుపెట్టనున్నారు. అనంతరం ఎంపీగా కడియం కావ్య ప్రమాణ స్వీకారం చేస్తారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి పార్లమెంటులో ఎంపీ కడియం కావ్య గళం విప్పుతారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.