India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇద్దరమ్మాయిల ప్రేమ చివరికి విషాదంగా మారింది. MHBD జిల్లా కురవి (M)కి చెందిన ఓ యువతికి(21), బయ్యారానికి చెందిన మరో యువతి(20) ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి HYDకు వెళ్లిపోయారు. వివాహం చేసుకొని సహజీవనం చేస్తుండగా పెద్దలు వారిని విడదీశారు. కురవి(M)కి చెందిన అమ్మాయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విషయం తెలుసుకున్న మరో యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కుమారుడి క్షణికావేశంలో తల్లి మృతి చెందింది. CI రంజిత్‌రావు కథనం ప్రకారం.. HNK జిల్లా శాయంపేట(M) కొప్పుల వాసి తిరుపతిరెడ్డి శనివారం పక్కింటి వారితో గొడవ పడ్డాడు. భార్య నాగరాణి ఆయనను వారించి ఇంట్లోకి తీసుకెళ్లారు. దీంతో తిరుపతిరెడ్డి భార్యను కొడుతుండగా తల్లి అమృతమ్మ(85) అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పక్కనే ఉన్న మంచం పట్టెతో తల్లిని కొట్టడంతో, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. కేసు నమోదైంది.
కుమారుడి క్షణికావేశంలో తల్లి మృతి చెందింది. CI రంజిత్‌రావు కథనం ప్రకారం.. HNK జిల్లా శాయంపేట(M) కొప్పుల వాసి తిరుపతిరెడ్డి శనివారం పక్కింటి వారితో గొడవ పడ్డాడు. భార్య నాగరాణి ఆయనను వారించి ఇంట్లోకి తీసుకెళ్లారు. దీంతో తిరుపతిరెడ్డి భార్యను కొడుతుండగా తల్లి అమృతమ్మ(85) అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పక్కనే ఉన్న మంచం పట్టెతో తల్లిని కొట్టడంతో, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. కేసు నమోదైంది.
ఏటూరునాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 10/10 GPA సాధించిన విద్యార్థి శ్రీరామ్ బిందు సాయిలత నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకోనుంది. ములుగు జిల్లా నుంచి వందేమాతరం ప్రతిభా పురస్కారానికి ఎంపికై, నేడు ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననుంది. దీంతో మండల ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భూపాలపల్లి జిల్లా కమలాపూర్ శివారులోని రాంపూర్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రేగళ్ల నరేశ్(30, రేగళ్ల ప్రమోద్(25), సిద్ధూ బైక్‌పై రాంపూర్ వైపు వెళ్తుండగా.. కారు ఢీకొట్టింది. నరేశ్ స్పాట్‌లోనే చనిపోగా, ప్రమోద్ హన్మకొండకు తరలిస్తుండగా మరణించాడు. నరేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వాజేడు మండలం జగన్నాధపురం వద్ద అతివేగంగా వస్తున్న 5 ఓవర్ లోడ్ ఇసుక లారీలను గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ డిడి కంటే 5 టన్నుల ఇసుక అదనంగా తరలిస్తున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. మండలంలోని అయ్యవారిపేటకు చెందిన 2, రాంపూర్‌కు చెందిన 3 లారీలుగా వాటిని గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి, వాజేడు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రవరం గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 4 ఐఈడీ మందు పాతరలను బీడీ బృందాలు గుర్తించినట్లు ఎస్పీ శబరిశ్ తెలిపారు. వాటిని చాకచక్యంగా నిర్వీర్యం చేశామన్నారు. మావోయిస్టులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మందు పాతరలను అమర్చి, అమాయకుల ప్రాణాలను తీస్తున్నారన్నారు. వీటిలో ఇప్పటికే 3 పేలిపోగా.. ఒక మందు పాతరను నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు.
హంటర్ రోడ్‌లోని గ్రీన్ వుడ్ పాఠశాల, బిర్లా ఓపెన్ మైండ్ పాఠశాల పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తీరును, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి.. పరీక్ష సజావుగా జరిగినట్లు తెలిపారు. జిల్లాలో ఈ పరీక్షకు 9902 మంది అభ్యర్థులకు గాను 6622 మంది 72.8 శాతంతో హాజరయ్యారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గత వైభవాన్ని తిరిగి తెస్తానని మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, కార్యకర్తలు పార్టీకి వెన్నంటి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని గత వైభవాన్ని తిరిగి తెస్తానని రాజయ్య అన్నారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను మహబూబాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మహబూబాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కేసీఆర్‌తో కాసేపు కవిత చర్చించారు. ఈ కార్యక్రమంలో కటికనేని హరిత, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.