India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల పరీక్షలు జరుగుతున్నాయి. జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలలో ఇద్దరు వ్యక్తులు ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తుండగా తనిఖీ అధికారులు డిబార్ చేసినట్లుగా పరీక్షలు నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీ రామోజు నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ నరేందర్లు తెలిపారు. వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పై విధులు నిర్వర్తిస్తున్న టెక్నికల్ సపోర్ట్ ఇంజినీరింగ్ సురేశ్ పై వేటు పడింది. అతడిని విధుల నుంచి తప్పిస్తూ హనుమకొండ డీటీసీ శ్రీనివాస్ పుప్పాల ఆదేశాలు జారీ చేశారు. మద్యం తాగి విధులకు హాజరయ్యారనే ఆరోపణలపై సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు డీటీసీ తెలిపారు.
ఏటూరునాగారం మండల కేంద్రంలో ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఐటిడిఏ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఐటిడిఏ అధికారి చిత్రా మిశ్రా పాల్గొన్నారు.
వరంగల్ నగరంలోని ఇంతేజార్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందజేసినట్లు సీఐ శివ కుమార్ తెలిపారు. మృతుడికి సుమారు 40-45 ఏళ్లు ఉంటాయని, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు పేర్కొన్నారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని పలువురు రైతులు పొడి దుక్కుల్లో విత్తనాలు వేసి వర్షం పడితే తమ విత్తనాలు మొలకెత్తుతాయని వేచి చూస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో జోరుగా వర్షం కురవాలని కప్పతల్లి ఆట, వరుణ దేవుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలు రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.19 వేల ధర పలికింది. అలాగే ఏసీ 341 రకం మిర్చి రూ.17 వేలు, ఏసీ వండర్ హాట్ (WH) మిర్చి రూ.17,200 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు మిర్చి భారీగా తరలి వచ్చింది.
KZPT- SEC మార్గంలో 2 రైళ్లు ఒకే పట్టాల మీదకు వచ్చినప్పుడు.. వాటికవే గుర్తించి వేగం తగ్గించుకొని నిలిచిపోయే ‘కవచ్ వ్యవస్థ’ ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 2022 మార్చి 4న రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ వికారాబాద్-లింగంపల్లి మధ్య ప్రయోగాత్మకంగా కవచ్ వ్యవస్థను పరిశీలించి విజయవంతం చేశారు. ఆ తర్వాత KZPT- SEC మార్గంలో కవచ్‌ను అభివృద్ధి చేస్తారని ప్రకటించారు. కానీ మూడేళ్లుగా జాడ కనిపించడం లేదు.
2004లో దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం కాగా.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యానికి నిధుల కొరత అడ్డంకిగా మారుతోంది. రూ.4,400 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును ప్రారంభించగా.. గతేడాది అది రూ.17 వేల కోట్లకు పెరిగింది. ఇప్పటికే రూ.13,911.88 కోట్లు ఖర్చు చేయగా.. మరో రూ.3,588 కోట్లు విడుదల చేస్తేనే ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చిన్నపెండ్యాలకు చెందిన శాగ శ్రీనివాస్ అప్పటి మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1989-90లో పదో తరగతి చదువుకున్నారు. ఆయన ఇటీవల మల్కాపూర్ పాఠశాలకు గెజిటెడ్ హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులైన ఇల్లందుల సుదర్శన్, జనగాం యాదగిరి మాట్లాడుతూ.. చదువుకున్న పాఠశాలకు హెచ్ఎంగా ఉద్యోగం రావడం అభినందనీయమన్నారు.
మూడు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. ఈ క్రమంలో పత్తి భారీగా తరలి రాగా.. శుక్రవారంతో పోలిస్తే ధర తగ్గింది. శుక్రవారం రూ.6,900 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.6,850కి పడిపోయింది. దీంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.