India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాజేడు మండలం టేకులగూడెం పంచాయితీ పరిధిలోని పలు కాలనీల్లో 15 రోజులుగా నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయితీ అధికారులు ఏర్పాటు చేసిన మోటార్ పనిచేయకపోవడంతో 2 కి.మీ దూరంలో ఉన్న గోదావరి నది నుంచి చిన్నపిల్లలతో సహా నీరు మోసుకొని రావాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు తాగునీరు అందేలా చూడాలని కోరారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కష్టపడి పని చేసిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పార్టీ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రవేశ పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వైద్యం వికటించడంతో ఓ మహిళ చేయి తొలగించాలని వైద్యులు సూచించిన ఘటన హన్మకొండ జిల్లా ఐనవోలులో జరిగింది. బాధితుల ప్రకారం.. ఉప్పలమ్మ అనే మహిళ గత నెల 30న వాంతులు చేసుకుంది. కుటుంబీకులు స్థానిక RMP వద్దకు తీసుకెళ్లగా కుడి చేతికి సెలైన్ ఎక్కించాడు. 2 రోజుల తర్వాత ఆమె చేయి పనిచేయకపోవడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. దీంతో చేయి తొలగించాలని వైద్యులు చెప్పడంతో కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కష్టపడి పని చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఆశించిన రీతిలో రాలేదని, రాకేష్ రెడ్డి నిత్యం బలంగా, సానుకూలంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేటీఆర్ అన్నారు.
జూన్ 9వ తేదీన (రేపు) జరుగనున్న గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ పరీక్షలకు 3,697మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. 14కేంద్రాలలో జూన్ 9వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అకాల మృతిపై పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించారన్నారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడని ఆమె కొనియాడారు.
పట్టభద్రుల MLC ఉపఎన్నిక లెక్కింపు 60 గంటలకు పైగా సాగింది. కౌంటింగ్‌లో మొత్తం 52మంది అభ్యర్థులు, 3వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 12 గంటల పాటూ ఏకధాటిగా విధుల్లో ఉండడంతో అలసిపోయారు. గోదాముల్లో కూలర్లు ఏర్పాటు చేసినా అక్కడి ఉక్కపోతతో కొంతమంది డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. గతంలో 56 టేబుళ్లపై లెక్కించగా.. ఈదఫా 96టేబుళ్లపై ఓట్లను లెక్కించినా ప్రక్రియ ఆలస్యమవడంతో అవస్థలు పడినట్లు తెలిపారు.
తెలంగాణ అధికారిక రాజముద్రపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాజముద్రలో కీర్తి తోరణం తొలగించలేదని, అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని, కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
WGL-KMM-NLG BRS ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఓటమిపై స్పందించారు. ఓటమిని అంగీకరించినట్లు ప్రకటించారు. సాంకేతికంగా ఓడిపోవచ్చు.. కానీ, నైతికంగా గెలిచానని అన్నారు. పన్నెండేళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నానని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పట్టభద్రుల కొరకు ప్రజా క్షేత్రంలో పోరాడుతానని పేర్కొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. తిరిగి సోమవారం మార్కెట్ ఓపెన్ కానుంది.
Sorry, no posts matched your criteria.