Warangal

News June 17, 2024

మా అత్తయ్యే గేమ్ ఛేంజర్: వరంగల్ కలెక్టర్

image

తన జీవితంలో గేమ్‌ ఛేంజర్‌ అత్తయ్య విజయలక్ష్మినే అని WGL కలెక్టర్‌ డా.సత్య శారదాదేవి అన్నారు. తాను పరిశోధనల్లో ఉన్నపుడు.. ప్రభుత్వ సర్వీసు ఉద్యోగాలు రాయాలని అత్తయ్యే సూచించారని చెప్పారు. HYDకు చెందిన ఈమె HCUలో జెనెటిక్స్‌లో పీహెచ్‌డీ, CCMBలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా పని చేశారు. అనంతరం గ్రూప్-1 రాసి ప్రభుత్వ సర్వీసులోకి వచ్చారు. కలెక్టర్ భర్త వరప్రసాద్‌ HYD సిటీ కాలేజీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌.

News June 17, 2024

మహబూబాబాద్: ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ఒకరి మృతి

image

మహబూబాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. బయ్యారం మండలం కోటగడ్డలో ప్రేమికులు ప్రవళిక, రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రవళిక ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలుసుకున్న రవీందర్ కత్తితో గొంతు కోసుకున్నాడు. రవీందర్ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక మృతదేహం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News June 17, 2024

ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

HYD నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో విద్యా సంవత్సరానికి డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమో కోర్సుల్లో చేరడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాము యాదవ్ తెలిపారు.ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ ద్వారా ఫీజుల్లో రాయితీ కల్పించడానికి ఈ నెల 23న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైనా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 17, 2024

హనుమకొండ: యువతిపై అత్యాచారం?

image

HNK జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(25)పై అదే గ్రామానికి చెందిన యువకుడు (27) అత్యాచారం చేసినట్లు సమాచారం. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. అవివాహితులైన వీరిద్దరూ బంధువులు కావడం గమనార్హం.బాధితురాలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 17, 2024

కాశీబుగ్గలో ఫ్లెక్సీ ఏర్పాటు.. పోలీసుల విచారణ

image

గ్రేటర్ వరంగల్‌లోని కాశీబుగ్గ కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్‌కు చెందిన అద్దెలు ఇద్దరు వ్యక్తులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆదివారం పోలీసులు విచారణ చేపట్టారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. మాజీ కార్పొరేటర్లు ఓని భాస్కర్, అంబి సాంబరాజు, కాంగ్రెస్ నాయకులు దాసరి రాజేశ్, కూచన రవీందర్ తదితరులను పోలీసు స్టేషన్‌కి పిలిపించి విచారించారు.

News June 17, 2024

HNK: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం: కలెక్టర్ 

image

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ఈ పరీక్షకు మొత్తం 4,730 మంది అభ్యర్థులకు గాను ఉదయం 2,637 హాజరయ్యారు. అంటే 55.75 %, మధ్యాహ్నం 2,614 అంటే 55.26 % మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో యుపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగినట్లు తెలిపారు.

News June 16, 2024

BHPL: గోదావరిలో యువకుడు గల్లంతు

image

భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో స్నానానికి దిగిన యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం..
వరంగల్ పట్టణానికి చెందిన గరికపాటి అఖిల్(19) ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు‌ కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక జాలరు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 16, 2024

వర్ధన్నపేట: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో విషాదం జరిగింది. గూగులోతు దేవేందర్ అనే రైతు తన వ్యవసాయ పొలంలో మోటర్ వద్ద వైర్లు సరిచేస్తుండగా.. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

News June 16, 2024

జనగామ: ఎలుగుబంటి ఆనవాళ్లు కలకలం

image

జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలంలో ఎలుగుబంటి ఆనవాళ్లు కలకలం రేపాయి. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబండ శివారులో ఎలుగుబంటి గత రాత్రి ఓ పెద్ద గుంత తవ్విందన్నారు . కాగా ఆ తవ్వకాలను చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని పట్టుకోవాలని స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థులు కోరుతున్నారు.

News June 16, 2024

లింగాల ఘనపూర్: యువతిపై కిడ్నాప్‌కు యత్నం

image

ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసేందుకు యత్నించి.. విఫలమై కారులో పారిపోయిన ఘటన లింగాల ఘనపూర్ మండలం పటేలుగూడెం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్థులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి పత్తి గింజలు నాటేందుకు పొలానికి వెళ్తుండగా ఓ వ్యక్తి కారులో వచ్చి యువతిని లాక్కెళ్లాడు. యువతి కేకలు వేయడంతో వదిలిపెట్టి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.