India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలురను నిరంతరం పర్యవేక్షించాల్సిన సిబ్బంది మద్యం మత్తులో మునిగి తేలిన ఘటన WGL బాలుర పరిశీలన గృహం(అబ్జర్వేషన్ హోం)లో జరిగింది. ఉన్నతాధికారుల ప్రకారం.. జూన్ 2న ఉప సంచాలకుడు పరిశీలన గృహాన్ని తనిఖీ చేయగా.. పర్యవేక్షిడితో పాటు కింది స్థాయి సిబ్బంది మద్యం మత్తులో మునిగి ఉన్నారు. వారితో మాట్లాడుతుండగా మత్తులో తూగుతుండటం గమనార్హం. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని జూన్ 3న సంచాలకుల కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ జిల్లా అధికారులు ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ పండుగను ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్యం, అలాగే అవసరమైన నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని వేస్ట్‌ను దూరంగా ఉంచి జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలని అన్నారు.
పరకాల నియోజకవర్గంలోని ఓ కన్వెన్షన్‌లో కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజయోత్సవ-అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పునాదిని నిర్మించే బాధ్యత మనందరి పైన ఉందని, పరకాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి క్వింటాకు రూ.18,500 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చికి రూ.17వేల ధర వచ్చింది. వండర్ హాట్ (WH) రకం మిర్చికి రూ.17,500 ధర వచ్చింది. కాగా, నేడు మార్కెట్‌కు మిర్చి తరలి వచ్చింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..
కాటారం మండలం దుబ్బపల్లి-విలాసాగర్ గ్రామాల మధ్య ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందిగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు దామెర కుంటలోని ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్నను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్నను ఎంపీ చామల శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రమాణం చేయనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు.
ఆర్టీసీ బస్సు ఆగకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు బస్సుకు అడ్డం తిరిగి రోడ్డుపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-MHBDకు వెళ్లే ఆర్టీసీ బస్సులో తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగారు. ఇంతలో డ్రైవర్ బస్సును పోనిచ్చాడు. సదరు మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో ఇంటర్ విద్యార్థిని(17) ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన యువతి వారం రోజుల కిందట పెద్దపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు.
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కానుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గత కొన్ని వారాలుగా ప్రతి బుధవారం మార్కెట్‌కు అధికారులు సెలవు ప్రకటించారు. తిరిగి నేడు ప్రారంభం కానుంది. రైతులు తేమలేని నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని
అధికారులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.