India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంతిమయాత్రలో పాల్గొన్న వారిపై కందిరీగలు దాడిచేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో బుధవారం జరిగింది. ఎంచగూడెం గ్రామానికి చెందిన వీరాస్వామి అనే వ్యక్తి మరణించగా.. దహన సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశానానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో టపాసులు పేల్చగా ఆ చప్పుళ్లకు సమీపంలో చెట్టుపై ఉన్న కందిరీగలు లేచి అంతిమయాత్రలో పాల్గొన్న వారిపై దాడిచేశాయి. దీంతో శవాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.
మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు మొక్కుగా సమర్పించిన రెండు కోడెలను ఆలయ సిబ్బంది కమలాపురానికి చెందిన ఓ వ్యక్తికి రూ.7,800లకు విక్రయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆలయ ఇన్‌ఛార్జి ఈవో మహేశ్‌ను నిలదీయడంతో తిరిగి కోడెలను దేవస్థానానికి రప్పించారు. ప్రస్తుతం ఈ విషయం చుట్టుపక్కల హాట్‌టాపిక్‌గా మారింది.
పాముకాటుతో మంగపేట మండలంలో మంగళవారం దండాల రాణి అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్థుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాలకు చెందిన దండల రాణి చుట్టపు చూపుగా పెద్దమ్మ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో దేవానగరంలోని పెద్దమ్మ ఇంట్లో మంచంపై కూర్చొని కాలు కింద పెట్టిన క్రమంలో పాముకాటుకు గురైంది. ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.
నిబంధనలకు అనుగుణంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్, సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ యానిమల్స్ నిబంధనలకు అనుగుణంగా, ఆర్టికల్-48 ప్రకారం పశుజాతుల రక్షణ, జంతువుల వధించుట నిషేధమన్నారు. ముస్లిం సోదరులందరూ శాంతి యుతంగా, ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులుగా తాము పరస్పర అవగాహనతో కలిసి సాగుతున్నామని మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్పష్టం చేశారు. తమ మధ్య విభేదాలున్నాయంటూ ఓ న్యూస్ ఛానల్ లోనూ, దినపత్రికలోనూ వచ్చిన తప్పుడు కథనాలపై మంత్రులు ఇరువురు స్పందించారు. అవి నిరాధారమైన ఆరోపణలంటూ కొట్టిపారేశారు. కొన్ని వ్యతిరేక శక్తులు కావాలని తమపై బురదజల్లే చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ పోలీసుల ప్రకారం.. భద్రాద్రి జిల్లాకు చెందిన సందీప్(25) HYDలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పనిపై సొంతూరుకు వచ్చిన అతడు స్నేహితుడితో కలిసి తిగురుపయనమయ్యాడు. MHBD నుంచి SCB షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తుండగా.. నెక్కొండ-ఎలుగూరు రైల్వేస్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఉమ్మడి WGL వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాదికి రూ.320 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పెంచితే ఏడాదికి రూ.500 కోట్లకు పైగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్‌నగర్ కాలనీలో బయటి మార్కెట్ ప్రకారం గజానికి రూ.40నుంచి రూ.50వేల వరకు పలుకుతోంది. మార్కెట్ విలువ రూ.9వేలు ఉంది. ఇలాంటి చోట్ల 40-50శాతం ఛార్జీలు పెంచే అవకాశముంది.
వరంగల్ జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కలెక్టర్ ప్రావీణ్య శ్రీకారం చుట్టారు. పలు మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను గుర్తించి వాటి అభివృద్ధి కోసం సుమారు రూ.22.19 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో వరంగల్ కేంద్రీయ గ్రంథాలయం, పర్వతగిరి, కరీమాబాద్, రంగశాయిపేట, ఉర్సు, నర్సంపేట, ఖానాపూరం, నెక్కొండ, చెన్నారావుపేట, దుగ్గొండి గ్రంధాలయాలు మరమ్మతుకు నోచుకోనున్నాయి.
పాత కాలంనాటి కచ్చా నాలాలతోనే ముంపు సమస్య ఉందని, వరదనీటి కాలువల నిర్మాణమే శాశ్వత పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం హన్మకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మేయర్, ఎంపీ, ఎమ్మెల్యేలు అన్ని ప్రభుత్వ శాఖలతో సమీక్ష సమావేశం జరగనుంది. వరద ముంపు, మొక్కల పెంపకం, 66 డివిజన్లలో అభివృద్ది పనులు తదితర అంశాలపై చర్చించనున్నారు.
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. సర్కార్ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. వరంగల్ జిల్లాలో 724 పాఠశాలలు ఉండగా.. మొదటి విడతలో 645 పాఠశాలను ఎంపికచేసి రూ.24.09 నిధులు కేటాయించారు.
Sorry, no posts matched your criteria.