India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్ వరంగల్ అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే డీఆర్‌ఎఫ్, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. మడికొండ మెట్టుగుట్ట వద్ద చెట్లు కూలడంతో అక్కడికి DRF బృందం వెళ్లాలని ఆదేశించారు. వరంగల్ బట్టలబజారు వేంకటేశ్వరస్వామి దేవాలయం ముందు వరద నీరు భారీగా నిలవడంతో పారిశుద్ధ్య కార్మికులు మళ్లించారు.
ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి-తాడ్వాయి మధ్య <<13364819>> బొలెరో వాహనం <<>>చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే మంగపేట మండలం రమణక్కపేటకు చెందిన ఓ వ్యక్తి తన కూతురు పుట్టు వెంట్రుకల వేడుక కోసం బంధువులతో కలిసి బొలెరో వాహనంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో చింతలమోరీ సమీపంలో బొలెరో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణ(60) అనే మహిళ మృతిచెందింది.
ప్రముఖ సీరియల్ నటి, బుల్లితెరలో పాపులర్ అయిన కార్తీకదీపం నటి ప్రేమీ విశ్వనాథ్ (వంటలక్క) ఈరోజు హనుమకొండ నగరంలో సందడి చేశారు. నేడు హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రుద్రేశ్వర స్వామిని ఆమె దర్శించుకొని పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో పలువురు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో BRS గెలుస్తుందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. అలాగే ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో BRS 11, BJP 2, కాంగ్రెస్, ఎంఐఎం చెరొకటి గెలుస్తాయని అంచనా వేసింది. భువనగిరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, బీఆర్ఎస్‌కు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని సీపాక్ తెలిపింది.
హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో SR మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల ఛైర్మన్ వరదారెడ్డి, కాగ్నిజెంట్ టెక్నాలజీ HR మేనేజర్ జితేందర్, ప్రిన్సిపల్ రాజశ్రీరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జితేందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు లాజికల్ స్కిల్స్ ఉపయోగించి కోడింగ్ సరళిలో మార్పులు తీసుకురావాలన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల వల్ల కాజీపేట మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను నేటి నుంచి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్, సికింద్రాబాద్-విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈనెల 2,5,6,8,9 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు.
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలు BRSవే అని సీపాక్ సర్వే అంచనా వేసింది. వరంగల్‌లో BRS నుంచి సుధీర్ కుమార్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, BJP నుంచి ఆరూరి రమేశ్ పోటీ చేశారు. ఇక మహబూబాబాద్‌లో BRS నుంచి మాలోతు కవిత, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, BJP నుంచి అజ్మీరా సీతారాం నాయక్ పోటీలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో BRS అభ్యర్థులే గెలుస్తారని సర్వే అంచనా వేసింది.
ప్రేమ పేరుతో గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాయపర్తిలో జరిగింది. యువతి తండ్రి కథనం ప్రకారం.. పెర్కవేడుకు చెందిన రాంబాబు పెద్ద కుమార్తె నర్మద, రాయపర్తికి చెందిన నరేశ్ కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. నరేశ్ పెళ్లికి నిరాకరిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం MPDO ఆఫీస్ ఆవరణలో పురుగుల మందు తాగింది. వెంటనే నర్మదను ఎంజీఎంకు తరలించారు.
కాకతీయ విశ్వవిద్యాలయ MA, M.Com, M.Sc 2nd year (2nd semester) M.Sc. 5సం. ఇంటిగ్రేటెడ్ (కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్ టైం టేబుల్ ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సౌజన్య విడుదల చేశారు. జూన్ 11న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడవ పేపర్, 18న నాల్గో పేపర్, 20న ఐదో పేపర్, 22న ఆరో పేపర్ జరుగుతాయని, మ. 2 గంటల నుంచి 5 గం.వరకు ఉంటుందన్నారు.
మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్‌దే అని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ పోటీ చేశారు. BJP నుంచి అజ్మీరా సీతారాం నాయక్, BRS నుంచి మాలోతు కవిత పోటీలో ఉన్నారు. కాగా తొలుత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి పోటాపోటీ ఉంటుందని చర్చ నడవగా.. తాజాగా విడుదలైన సర్వేలో కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.