India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క-సారలమ్మల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిపేలా గద్దెల వెనకవైపు ఉన్న 25 ఎకరాల్లో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది. జాతర విశేషాలతో పాటు.. అప్పటి వస్తువులు, వారి గొప్పతనం తెలిపేలా మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్ట సుందరీకరణతో పాటు భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. నిన్న క్వింటా పత్తి రూ.7,025 ధర పలకగా నేడు రూ.25 తగ్గి రూ.7వేలకి పడిపోయింది. పత్తి ధర మళ్లీ తగ్గడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గార్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ బజార్‌కి చెందిన 15 నెలల చిన్నారి షబానా క్యాన్సర్ వ్యాధితో మృతిచెందింది. పుట్టిన కొద్దిరోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు కేంద్ర కేబినేట్‌లో చోటుదక్కిన విషయం తెలిసిందే. దీంతో తమజిల్లాకు ఇవి వచ్చేలా చూడాలంటూ జిల్లా వాసులు కోరుతున్నారు.
*మామునూరు ఎయిర్‌పోర్టు
*బయ్యారం, కొత్తగూడ, గంగారం ప్రాంతాల్లోని బొగ్గు నిక్షేపాల భూగర్భ గనుల ఏర్పాటు
*ఇనుము, గ్రానైట్, బెరైటీస్, డోలమైట్, లాటరైట్ నిక్షేపాల పరిశ్రమల ఏర్పాటు
*వెయ్యి స్తంభాల గుడికి యునెస్కో గుర్తింపు
*ఇల్లెందులో నూతన ఉపరితల గని ఏర్పాటు
ట్రాక్టర్ రోటవేటర్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన WGL జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. లైన్ తండాకు చెందిన యశోద, రాజు దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు బాలు(12) నాలుగో తరగతి చదువుతున్నాడు. పొలం దున్నేందుకు తండ్రి వెళ్తుండగా.. తానూ వస్తానని కొడుకు మారం చేయడంతో ట్రాక్టర్‌పై తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పొలం దున్నుతుండగా కుమారుడు రోటవేటర్‌లో పడిపోవడంతో శరీరం ఛిద్రమైపోయింది.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుంచి ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహచారి తెలిపారు. మొదటి పేపర్ జూలై 1న, రెండో పేపర్ 3న, మూడో పేపర్ 5న, నాలుగో పేపర్ 8న, ఐదో పేపర్ 10వ తేదీల్లో ఉంటాయని, ఆరో పేపర్ మాత్రం 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ప్రవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యాలు, డ్రైవర్లు నిబంధనలను పాటించాలని ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ఉప్పల శ్రీనివాస్ అన్నారు. సోమవారం అంబేడ్కర్ భవన్లో వడుప్సా ఆధ్వర్యంలో డ్రైవర్లు, హెల్పర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు అజాగ్రత్తగా ఉండొద్దన్నారు.
ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుగులోతు రాజు సోమవారం పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్ వేసుకెళ్లాడు. అతని కుమారుడు బాలు(7)ను తన వెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న బాలు.. ట్రాక్టర్ వెనక వైపునకు వచ్చాడు. అది గమనించని తండ్రి రాజు రివర్స్ తీస్తుండగా రోటవేటర్‌లో చిక్కుకుని మృతిచెందాడు.
ఇద్దరమ్మాయిల ప్రేమ చివరికి విషాదంగా మారింది. MHBD జిల్లా కురవి (M)కి చెందిన ఓ యువతికి(21), బయ్యారానికి చెందిన మరో యువతి(20) ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి HYDకు వెళ్లిపోయారు. వివాహం చేసుకొని సహజీవనం చేస్తుండగా పెద్దలు వారిని విడదీశారు. కురవి(M)కి చెందిన అమ్మాయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విషయం తెలుసుకున్న మరో యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కుమారుడి క్షణికావేశంలో తల్లి మృతి చెందింది. CI రంజిత్‌రావు కథనం ప్రకారం.. HNK జిల్లా శాయంపేట(M) కొప్పుల వాసి తిరుపతిరెడ్డి శనివారం పక్కింటి వారితో గొడవ పడ్డాడు. భార్య నాగరాణి ఆయనను వారించి ఇంట్లోకి తీసుకెళ్లారు. దీంతో తిరుపతిరెడ్డి భార్యను కొడుతుండగా తల్లి అమృతమ్మ(85) అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పక్కనే ఉన్న మంచం పట్టెతో తల్లిని కొట్టడంతో, చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.