India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలో ఒకే వారంలో ఇద్దరు బాలురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. MHBD జిల్లా గంగారం మండలానికి చెందిన హర్షవర్ధన్, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన సిద్ధూ.. తొమ్మిదేళ్ల వయసువారే. ఒకరు హెయిర్ కటింగ్ నచ్చలేదని చనిపోతే, మరొకరు ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటే.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని పలువురు సూచిస్తున్నారు.
కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌లో చోటుచేసుకుంది. తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన దాసరి బాలస్వామి(47) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంట్లో తరుచు గొడవల కారణంగా ఆయన మద్యానికి బానిసయ్యాడు. దీంతో బాలస్వామి భార్య తన ఇద్దరు పిల్లలకు తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
WGL నగరంలోని పలు ఖరీదైన రెస్టారెంట్లలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీళ్లో బూజుపట్టిన చికెన్, బొద్దింకలతో కూడిన ఇండ్లీ పిండి, ఈగల చెట్నీ, కుళ్లిన గుడ్లు, కూరగాయలు వెలుగు చూశాయి. దీంతో అధికారుల పర్యవేక్షణ లేక యాజమాన్యాలు ఇష్టారీతిన ఆహారం తయారు చేస్తూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఫుడ్ తింటే బెడ్ ఎక్కడం ఖాయమని ప్రజలు ఫైర్ అవుతున్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం భద్రచాలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం తరఫున ఈవో రమాదేవి, ఉప ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణాచార్యులు పట్టువస్త్రాలను తీసుకురాగా అంజన్న ఆలయ అధికారులు డప్పుచప్పుళ్ల మధ్య ఆలయం వరకు శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం ఈవో చంద్రశేఖర్‌కు పట్టువస్త్రాలను అందజేశారు.
మేడారంలోని విఐపి పార్కింగ్ సమీపంలో పేకాట ఆడుతున్న 14 మందిని సివిల్, సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. WGL, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఇబ్రహీం, షకీల్, జావిద్, రవిచందర్, సంజీవ, నర్సింగం, సతీష్ ఇజ్జగిరి, లక్ష్మీనారాయణ, సంపత్, వేణు, సంతోష్, ఫరీద్, నగేష్ లు మేడారం జాతరకు వచ్చి విఐపి పార్కింగ్ సమీపంలోని శివరాంసాగర్ చెరువు పక్కన పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. రూ.2లక్షల 500 నగదు, 2కార్లు,13ఫోన్లను సీజ్ చేశారు.
నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. చింతగూడెం గ్రామానికి చెందిన హర్షవర్ధన్(9) తన తండ్రి నచ్చని హెయిర్ కటింగ్ చేయించాడని మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు.
మంగపేట మండలంలోని రాజుపేట కెనరా బ్యాంకులో ఇటీవల బంగారం దొంగిలించిన అప్రైజర్ ప్రశాంత్‌ను ఏటూరునాగారం మండలం ఎక్కెల క్రాస్ వద్ద ఏఎస్పీ గితే మహేష్ బాబాసాహెబ్ పట్టుకున్నారు. ఏఎస్పీ వివరాల ప్రకారం.. అతని వద్ద రూ.2,82,000 విలువైన 47 గ్రాముల బంగారం, రూ.2,19,000 విలువైన 2.190 కేజీల వెండి, రూ.2,51,000 నగదు, కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైసంపల్లి గ్రామానికి చెందిన సిద్దు(9) అనే బాలుడు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేసవి సెలవులు రావడంతో బాలుడు ఇతరుల ఇళ్లకు వెళ్లి ఆడుకునే వాడు. దీంతో ఆ బాలుడి తల్లి మందలించింది. మనస్తాపంతో బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇటీవల జరిగిన NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నిక ఫలితంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక్కడి పోలింగ్ సరళిపై విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరుగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా లేక ద్వితీయ ప్రాధాన్యత ఓటుతో విజయం సాధిస్తారా? అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్థులు ఎవరికి వారే తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం పలు రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.16,500 పలకగా.. ఏసీ తేజ మిర్చి రూ.19,500 ధర పలికింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి రూ.17,000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,500 ధర వచ్చింది. మరోవైపు టమాటా మిర్చికి రూ.25 వేల ధర వచ్చింది.
Sorry, no posts matched your criteria.