Warangal

News May 30, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,210

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం ప్రత్యేక సెలవు ఉండగా.. ఈరోజు పునః ప్రారంభమైంది. నేడు మార్కెట్‌కు పత్తి తరలి రాగా.. మంగళవారంతో పోలిస్తే ధర తగ్గింది. మొన్న క్వింటా పత్తి ధర రూ.7,275 పలకగా.. నేడు రూ.7,210కి చేరింది. పత్తి ధరలు దారుణంగా పడిపోతుండడంతో అన్నదాతలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

News May 30, 2024

నేటి నుంచి హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు

image

కొండగట్టు అంజన్న ఆలయం హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి శనివారం వరకు నిర్వహించే ఉత్సవాలకు దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. 2 లక్షలకుపైగా దీక్షాపరులు తరలివచ్చి మాల విరమణ చేస్తారని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. తలనీలాలు సమర్పించేందుకు వీలుగా 1500 మంది క్షరకులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News May 30, 2024

విద్యుత్ సరఫరాలో సమస్యలు అధిగమిస్తున్నాం: వరుణ్ రెడ్డి

image

విద్యుత్ సరఫరాలో సమస్యలను అధిగమిస్తున్నామని ఎన్పీడీసీఎల్ CMD వరుణ్ రెడ్డి తెలిపారు. గతేడాది జనవరి నుంచి మే వరకు పరిస్థితిని చూసుకుంటే ఈసారి ట్రిప్పింగ్స్ తగ్గాయని చెప్పారు. గతేడాది 11 కేవీ ట్రిప్పింగ్స్ 57,771 ఉండగా ఈసారి 40,724 నమోదై 29.51 శాతం తగ్గిందన్నారు. గతంలో 10,558 అంతరాయాలు ఉండగా.. 7,262 గంటలకు తగ్గి 31.22 శాతం నమోదైందన్నారు. వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు.

News May 30, 2024

మహబూబాబాద్: దివ్యాంగ బాలికపై అత్యాచారయత్నం

image

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో మానసిక దివ్యాంగ బాలిక(8)పై మద్యం మత్తులో యువకుడు అత్యాచారయత్నం చేశాడు. స్థానికుల వివరాలు.. మండల పరిధిలోని ఓ తండాలో యువకుడు బాలికకు చాక్లెట్ ఆశజూపి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం లైంగిక దాడి యత్నించడంతో బాలిక కేకలు వేసింది. బాలిక తల్లిదండ్రులు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

నేడు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో గురువారం ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని, రైతులు నాణ్యమైన సరకులు తీసుకుని రావాలని అధికారులు సూచించారు.

News May 29, 2024

కొండగట్టులో పెద్ద జయంతి ఉత్సవాలకు అంకురార్పణ

image

ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో పెద్ద జయంతి ఉత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. యాగశాల శుద్ధి, పుణ్యాహవాచనం, అఖండ దీపస్థాపన తదితర కార్యక్రమాలు చేపట్టారు. కాగా గురువారం ఉదయం 9 గంటల నుంచి జయంతి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.

News May 29, 2024

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ గుమస్తా సంఘం విజ్ఞప్తి మేరకు బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని, రైతులు నాణ్యమైన సరకులు తీసుకుని రావాలని అధికారులు సూచించారు.

News May 29, 2024

వరంగల్: గ్రూప్‌-2, సింగరేణి ఉద్యోగాలంటూ మోసం

image

గ్రూప్-2, సింగరేణి ఉద్యోగాలిప్పిస్తామని రూ.4 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముఠాను కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రవీణ్‌‌కమార్ వివరాల ప్రకారం.. WGL రంగశాయిపేటకు చెందిన దాసు హరికిషన్‌ చుంచుపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. ఈ స్కామ్‌లో హరికిషన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

News May 29, 2024

వరంగల్ మార్కెట్‌కి 6 రోజుల సెలవులు

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 6 రోజుల సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి గుగులోతు రెడ్డి తెలిపారు. జూన్ 1న వారాంతపు యార్డు బంద్, 2న ఆదివారం సాధారణ సెలవు. 3, 4, 5వ తేదీల్లో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ను పురస్కరించుకుని ఎన్నికల అధికారులు, కలెక్టర్ల ఆదేశాలమేరకు మార్కెట్‌కు సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. 6న అమావాస్య సెలవు ఉందని, 7వ తేదీ శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభం కానుంది.

News May 29, 2024

WGL: అదుపుతప్పి బోల్తా పడిన ఆటో.. మహిళ మృతి

image

హన్మకొండ-ములుగు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం గూడెప్పాడు సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్‌కు చెందిన వీరు తాడ్వాయి మండలం మేడారం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.