Warangal

News May 29, 2024

ములుగు: ఇసుక లారీ ఢీకొని ఒకరు మృతి

image

ములుగు జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ట్రాక్టర్‌ను లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడిని పారిశుద్ధ్య కార్మికుడు సారయ్య(52)గా గుర్తించారు. కాగా, మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 29, 2024

WGL: అదేరోజు బాలిక, మంగళవారం యువకుడు మృతి

image

ఇటీవల ఓ మైనర్ ప్రేమ జంట <<13309776>>రైలు కింద పడి<<>> ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవులుకు ఫోన్ కాల్‌లో ఖమ్మంకు చెందిన సుష్మతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈనెల 24న వరంగల్ 12 మోరీల జంక్షన్ వద్ద రైలు కిందపడి ఆత్మ హత్యాయత్నం చేయగా.. సుష్మ(17) ఘటనాస్థలంలోనే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన చెన్నకేశవులు ఎంజీఎంలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

News May 29, 2024

2024@ ఎలక్షన్.. జనగామ ఫస్ట్, మహబూబాబాద్ లాస్ట్

image

ఈనెల 27న WGL-KMM-NLG ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఉమ్మడి WGL వ్యాప్తంగా 73.80 శాతం పోలింగ్ నమోదయింది. 2021తో పోలిస్తే 3.02శాతం పోలింగ్ తగ్గింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పరిశీలిస్తే 76.34శాతంతో జనగామ అగ్రస్థానంలో నిలవగా.. ములుగు రెండో స్థానంలో నిలిచింది. WGL-3, BHPL-4, HNK-5 స్థానంలో ఉండగా.. 72.15శాతంతో మహబూబాబాద్ చివరి స్థానంలో నిలిచింది.

News May 28, 2024

ములుగు: కౌంటింగ్ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

image

జూన్ 4న కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు అన్నారు. ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో నమోదు చేయాలని సూచించారు.

News May 28, 2024

HNK: డాక్టర్ సూది ఇవ్వగానే ప్రాణం విడిచాడు!

image

HNK జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబీకుల వివరాలు.. ధర్మసాగర్ మండలం ములకలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు(45) క్వారీలో గ్రానైట్ కట్టర్‌గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుంటున్న సమయంలో కిందపడటంతో కాలికి దెబ్బ తగిలింది‌. దీంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్ సూది ఇవ్వగానే తమ తండ్రి ప్రాణం విడిచాడని, డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయారని వెంకటేశ్వర్లు కొడుకు ఆరోపించారు.

News May 28, 2024

రేపటి నుంచి కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు

image

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుంచి 1 వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయంలో నిర్వహించనున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, దీక్షాపరులు లక్షల సంఖ్యలో తరలిరానున్నందున ఆర్జిత సేవలు రద్దు చేశారు. కాగా, జయంతికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ తెలిపారు.

News May 28, 2024

WGL: అమ్మమ్మను కాపాడబోయి మనవడు మృతి

image

భూపాలపల్లి జిల్లా <<13326459>>మొగుళ్లపల్లి మండలంలో విషాదం<<>> నెలకొంది. గ్రామస్థుల ప్రకారం.. చిట్యాల మండలం వెంకట్రావుపల్లి(సీ) గ్రామానికి చెందిన రామలక్ష్మి(60) పిడిసిల్లలోని పెద్ద కూతురు ఇంటికి వెళ్లింది. రోజూలానే ఆరేసిన బట్టలను తీయడానికి వెళ్లి దండేన్ని తాకగానే కరెంట్‌ షాక్‌కు గురయింది. గమనించిన మనవడు సాయిచరణ్(15) ఆమెను కాపాడేందుకు వెళ్లగా కరెంట్ షాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News May 28, 2024

జనగామ: బాలికను గర్భవతి చేసిన యువకుడు అరెస్ట్

image

ప్రేమ పేరిట మైనర్‌ను నమ్మించి ఓ యువకుడు గర్భవతిని చేసిన ఘటన జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలికను ప్రకాష్ అనే యువకుడు నమ్మించి మోసం చేశాడు. దీంతో మైనర్‌పై జరిగిన లైంగిక దాడిలో గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

News May 28, 2024

వరంగల్: నిన్నటితో పోలిస్తే రూ.75 పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,200 పలకగా నేడు రూ.75 పెరిగి రూ.7275 ధర అయింది. అయితే గతవారంతో పోలిస్తే పత్తి ధరలు భారీగా పడిపోవడంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరలు పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు.

News May 28, 2024

వరంగల్: 2024 MLC ‘ఎలక్షన్ HIGH LIGHTS’

image

* జనగామ జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం. 2021లోనూ జనగామనే టాప్.
* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికల కంటే స్వల్పంగా పెరిగిన ఓటింగ్ శాతం.
* పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన MLC అభ్యర్థులు.
* సాయంత్రం 6గంటల వరకూ కొనసాగిన పోలింగ్.
* ఓటు హక్కును వినియోగించుకున్న ఉమ్మడి జిల్లా కలెక్టర్లు.
* భారీ బందోబస్తులో బ్యాలెట్ పెట్టెలను నల్గొండకు తరలింపు.