Warangal

News May 28, 2024

WGL: గుండెపోటుతో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మృతి

image

గుండెపోటుతో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మృతి చెందిన ఘటన MHBD జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తొర్రూరు మండలానికి చెందిన రాపోలు ప్రభాకర్ దేవరుప్పుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఇంట్లో ఉన్న సమయంలో సోమవారం తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు.

News May 28, 2024

వరంగల్: 2021లో 76.82%, 2024లో 72.66 శాతం?

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులు సోమవారం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. 2021లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76.82 శాతం పోలింగి నమోదయితే నిన్న జరిగిన ఎన్నికల్లో 72.66 శాతం అంటే.. 4.16% తక్కువ నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,68,727 మంది ఓటర్లు ఉండగా.. నిన్న సాయంత్రం వరకు 1,21,230 మంది ఓటేశారు. పలు చోట్ల సా.6గంటల వరకూ పోలింగ్ జరిగింది.

News May 28, 2024

వరంగల్ మార్కెట్‌కు తరలివచ్చిన పసుపు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి సోమవారం పసుపు, మక్కలు బిల్టీ తరలివచ్చింది. క్వింటా పసుపుకి రూ.14,743 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే మక్కలు బిల్టీ రూ.2,335 ధర పలికాయి. కాగా గత వారంతో పోలిస్తే పసుపు ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో సరకులకు ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలుపుతున్నారు.

News May 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి HEADLINES

image

> జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల MLC ఎన్నికలు
> కొత్తగూడ: న్యూమోనియాతో బాలుడు మృతి
> మొగుళ్లపల్లి: పిడిసిల్లలో కరెంటు షాకుతో మనవడు, అమ్మమ్మ మృతి
>కేసముద్రంలో ఓటు వేయకుండా వెనుదిరిగిన పట్టభద్రుడు
>బామ్మర్ది కోసం ఐనవోలుకు మోకాళ్లపై నడిచిన బావ
> 9వ రోజుకు చేరిన మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
>MHBD: అస్వస్థతకు గురైన పోలింగ్ అధికారి
>WGL: ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్

News May 27, 2024

ఉమ్మడి వరంగల్‌లో ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు ఇలా..

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం వరంగల్ -నల్గొండ -ఖమ్మం పట్టభద్రుల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో 70.83%, ములుగు 74.54%, జనగామ 76.28%, భూపాలపల్లి 69.16%, హనుమకొండ 72.16%, మహబూబాబాద్ జిల్లాలో 69.52% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది.

News May 27, 2024

బాసర IIIT ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

image

నిర్మల్ జిల్లా బాసర IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఈమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.
# Share it

News May 27, 2024

భూపాలపల్లి: కరెంట్ షాక్.. అమ్మమ్మ, మనవడు మృతి

image

భూపాలపల్లి జిల్లాలో విషాదం జరిగింది. మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో దుంప సాయిచరణ్(14), అతడి అమ్మమ్మ రామలక్ష్మి (55) కరెంట్ షాకుతో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 27, 2024

వరంగల్ జిల్లా వ్యాప్తంగా 70.83 శాతం పోలింగ్ నమోదు

image

వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా.4 గంటల వరకు 70.83% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు అన్నారు. వరంగల్ జిల్లాలో ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది తమ సామగ్రితో జిల్లా కేంద్రానికి బస్సులలో తరలివెళ్ళనున్నారు.

News May 27, 2024

HNK: బావమరిది కోసం మోకాళ్లపై నడిచి మొక్కు తీర్చుకున్న బావ 

image

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తన బావమరిది రజినీకాంత్ కోలుకుంటే మోకాళ్ల మీద ఐనవోలు మల్లికార్జున స్వామి వారి దర్శనానికి నడుచుకుంటూ వస్తానని కమలాపూర్ మండలం  అంబాలకు చెందిన నాగరాజు మొక్కుకున్నారు. ఈ మేరకు రజినీకాంత్ ఆరోగ్యం మెరుగుపడటంతో నాగరాజు మొక్కు తీర్చుకునేందుకు మోకాళ్లపై 70 కి.మీ నడుచుకుంటూ ఐనవోలు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నాగరాజును అభినందిస్తున్నారు.

News May 27, 2024

WGL: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.