India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభం కావడంతో పత్తి తరలివచ్చింది. అయితే గతవారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. నేడు క్వింటా పత్తి ధర రూ.7,200 పలికింది. పత్తి ధర మళ్లీ తగ్గడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. కాగా, మార్కెట్లో క్రయ విక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
వరంగల్ జిల్లాలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో ఉదయం 10:00 గంటల వరకు పోలింగ్ 13.19% అయింది. ఓటర్లు తమ ఓటును సకాలంలో వినియోగించుకోవాలని అధికారులకు కోరుతున్నారు. ఇప్పటివరకు 13 శాతం ఓటింగ్ పోల్ కావడంతో రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లకు ఫోన్ చేసి ఓటు వేసేందుకు మోటివేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అధికారులు కూడా చెబుతున్నారు.
KMM-WGL-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మం. మాదాపురం ZPHSలో, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి HNKలోని సుబేదారి, హంటర్‌రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో, BRS అభ్యర్థి రాకేష్‌రెడ్డి HNKలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.
ఉమ్మడి WGL-KMM-NLG జిల్లాల్లో నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఉమ్మడి WGL వ్యాప్తంగా మండల, పట్టణాలన్నింటిలో కలిపి 222 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 2021 మార్చిలో జరిగిన పట్టభద్రుల పోలింగ్‌లో ఉమ్మడి జిల్లాలో 1,81,313 మంది ఓటర్లుండగా.. 1,38,203 మంది అంటే, 76.22 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. 43,110 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఈసారి ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందో చూడాలి మరి.
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. గ్రాడ్యుయేట్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఎలక్షన్ అధికారులు సూచించారు.
☞ పోలింగ్ అధికారి ఇచ్చే పెన్నుతో బ్యాలెట్ పేపర్‌లో1,2,3,4 ఇలా ప్రాధాన్యత క్రమంలో వేయాలి
☞మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి
☞ఒక్కరికి/కొందరికి/అందరికీ ఓటు వేయవచ్చు
☞ఆరుగురికి ఓటు వేయాలనుకుంటే.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అభ్యర్థి ఫోటో ఎదురుగా ఉండే బాక్స్‌లో 1 నంబర్ వేయాలి. మిగితా అభ్యర్థులకు 2,3,4,5,6 నంబర్లు రాయాలి
☞1,2,3 నంబర్లు వేసి, 4 వేయకుండా 5వ నంబర్ వేస్తే ఆ ఓటు చెల్లదు
ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో తన ఇంటి ముందు యువతి బైఠాయించి ఆందోళనకు దిగింది. చెన్నారావుపేట మండలంలో ఓ యువతి, అన్వేష్ అనే యువకుడితో ఎనిమిదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. బాధిత యువతిని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి తనని మోసం చేస్తున్నాడని యువతి తెలిపింది. దానికి కారణం అన్వేష్ మరో అమ్మాయి మోజులో పడ్డాడని, ఈ కారణంగానే వివాహాన్ని వాయిదా వేస్తున్నాడని యువతి ఆరోపించింది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌కు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలు వరకు పోలింగ్ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో సాగే పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ ఆఫీసర్స్ 71 మంది, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ 71 మంది, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 142 మంది, 11 మంది సెక్టార్ ఆఫీసర్లకు ఎస్ఎన్టీ టీమ్స్‌కు శిక్షణ ఇచ్చి నియమించారు.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. ఈరోజు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
బాలిక కిడ్నాప్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 24న నడికుడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన బాలిక కిడ్నాప్ అయ్యింది. ఈ కేసులో బండి దీక్షిత్, కుమారస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
Sorry, no posts matched your criteria.