India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వర్ధన్నపేటలోని ఓ సినిమా థియేటర్‌లో శుక్రవారం కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవల్లో విజయ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. సదరు యువకుడికి కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. థియేటర్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వరంగల్‌లో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ ఆలయ ఆవరణలో గల వేదపాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు EO శేషుభారతి తెలిపారు. మాతృభాషలో చదవగలిగి, రాయగలిగిన 8-12 మధ్య వయస్సు ఉండి ఉపనయన సంస్కారం, ఉపాకర్నోత్సర్జనములు పూర్తైనవారు సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞంలు కంఠస్థం వచ్చినవారు పాఠశాలలో ప్రవేశానికి అర్హులన్నారు. ఈనెల 13 నుంచి 22వరకు వేద పాఠశాల వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పసుపు, పల్లికాయ ధరలు తగ్గాయి. > నిన్న రూ.13,759పలికిన పసుపు..నేడు రూ. 12,659కి పడిపోయింది. > సూక పల్లికాయ ధర నిన్న రూ. 6160 పలకగా..ఈరోజు రూ.6020 పలికింది. > పచ్చి పల్లికాయ ధర నిన్న రూ.4550 పలకగా.. నేడు రూ. 4300 పలికింది. > 5531 రకం మిర్చికి నిన్న రూ.13వేల ధర రాగా…నేడు రూ.12,500 వచ్చింది.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రికార్డు ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా నేడు క్వింటా మక్కలు రూ.2,645 పలికింది. దీంతో మక్కలు పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో మక్కల ధరలు చూస్తే.. సోమవారం రూ.2,605, మంగళవారం రూ.2,615, బుధవారం రూ.2,620, గురువారం రూ.2,635 పలికాయి.

పదహారుచింతల్‌లో జరిగిన హత్య మరవకముందే వరంగల్ జిల్లాలో మరో హత్య జరిగింది. గొర్రెకుంట శివారులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు ఏపీకి చెందిన మేస్త్రీగా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం మృతదేహాన్నిఎంజీఎంకు తరలించారు. కాగా, ఈ హత్య దుండగులు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజల సమస్యలను అధికారులు పరిష్కరించేందుకు కృషి చేయాలని సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ తదితరులున్నారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర రూ.160 పెరిగింది. నిన్న రూ.7,300 పలికిన క్వింటా పత్తి.. నేడు రూ.7,460కి చేరింది. ఈ వారంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ధరలు మరింత పెరగాలని ఆ దిశగా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతి) బ్యారేజీలో పూణే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్(CWPRS)కు చెందిన ముగ్గురు నిపుణుల బృందం జియోఫిజికల్ రెండో దశ పరీక్షలను ఇంజనీరింగ్ అధికారులతో కలసి ముమ్మరం చేసింది. గత ఏడాది నవంబర్లో బ్యారేజీలో సీపేజీ లీకేజీలు ఏర్పడిన నేపథ్యంలో పలుమార్లు NDSA, CWUC బృందాలు పర్యటించాయి. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయి.

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి.
> ఏసీ తేజ మిర్చి నిన్న క్వింటాకు రూ.నిన్నటిలాగే రూ.18,300 పలికింది.
> ఏసీ 341 రకం మిర్చి సైతం గురువారం లాగే రూ.14,500 పలికింది.
> వండర్ హాట్(WH) మిర్చి మాత్రం గత 2రోజులతో పోలిస్తే భారీగా పెరిగింది. మొన్న రూ.14,800 ధర పలకగా.. నిన్న రూ.15,000కి చేరింది. నేడు మరింత పెరిగి రూ.16,500 అయింది.

వరంగల్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 7 నెలల్లో కమిషనరేట్ పరిధిలో 24 హత్యలు, 59 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాశీబుగ్గ, జులైవాడలో కుటుంబ తగాదాలతో భార్యలను భర్తలు హతమార్చారు. గతనెల 30న అర్థరాత్రి మట్టెవాడలో రోడ్డుపై నిద్రిస్తున్న కూలీని స్థానిక వ్యక్తి హత్య చేశాడు. భూ వివాదంలో బుర్హన్‌పల్లి మాజీ సర్పంచిని దారుణంగా హత్య చేశారు. నిన్న 16చింతల్‌లో దంపతుల హత్య జరిగిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.