India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జనగామ జిల్లా ముఖద్వారం పెంబర్తి శివారు ఏకశిలా కళా తోరణం వద్ద ఉన్న జాతీయ రహదారుల విభాగిని ముఖ్య కూడళ్లలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన పూలమొక్కలు ఆకట్టుకుంటున్నాయి. రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికుల మనసును దోచేలా ఉన్న పూల మొక్కలు, రంగు రంగుల పుష్పసోయగంతో తోరణం కొత్త అందాలను సంతరించుకుంది.

పెళ్లి కావట్లేదు అనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో జరిగింది. పోలిసుల వివరాల ప్రకారం.. కంచనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్(27) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి సరైన ఉపాధి లేదని, పెళ్లి సంబంధం కూడా రావడం లేదని మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

డబ్బులిస్తే ANM, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగులకు సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. అది నిజమనుకొని నిరుద్యోగులు DMHO ఆఫీస్‌కు పరుగులు తీస్తున్నారు. మీ పేరు జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీ జాబితాలో ఉందని, రూ.50 వేలు ఇస్తే వారంలో నియామక ఉత్తర్వులు అందిస్తామని కాల్ చేస్తున్నారు. అయితే వాటిని నమ్మొద్దని ఫోన్ వస్తే ఫిర్యాదు చేయాలని DMHO వెంకటరమణ స్పష్టంచేశారు.

వరంగల్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రై సిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు, వినియోగం జరిగే ప్రాంతాల వివరాలను పోలీస్ కమిషనర్ ఏసీపీలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వరంగల్‌లో గంజాయికి సంబంధించి నమోదయిన కేసుల వివరాలను ఆరా తీశారు. డ్రగ్స్ పై కఠినంగా ఉండాలన్నారు.

గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని MHBD జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ, అమ్మ ఆదర్శ పాఠశాలలు తదితర అంశాలపై సంబధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.

ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని DMHO కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆరోగ్య కార్యకర్తలకు హనుమకొండ DMHO డా.సాంబశివరావు పలు సూచనలు చేశారు. జనాభాను అరికట్టేందుకు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులైన వ్యాసెక్టమీ లేదా ట్యూబెక్టమీ ఆపరేషన్లు మాత్రమే కాకుండా, కాన్పుల మధ్య అంతరం కోసం తాత్కాలిక గర్భనిరోధక పద్ధతులను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆరోగ్య కార్యకర్తలపై ఉందన్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 27 మందికి స్థానచలనం కల్పిస్తూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు.

జనగామ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్ని వీర్ వాయులో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి గురువారం తెలిపారు. ఇంటర్ లేదా డిప్లమా పూర్తి చేసి, 3-07-2004 నుంచి 03-01-2008 మధ్య పుట్టి పెళ్లి కాని యువతి, యువకులు ఇందుకు అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గంజాయి అక్రమరవాణాను మహబూబాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. MHBD- ఇల్లందు రోడ్డులో కళ్యాణి నర్సరీ వద్ద ఎస్ఐ దీపిక ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కారులో వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన అజిత్ అరుణ్, ఆనందరావును పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రూ.11,20,000 విలువైన 56కేజీల గంజాయి, ఒక కారు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సర్వయ్య తెలిపారు.

తాను బాగా చదువుకొని టీచర్ అవుతానని తక్కల్లగూడెం గుత్తిగూడెం ఆదివాసీ బిడ్డ పూనెం తులసి అంటోంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన పాత్రను నేచురల్ చేసినట్లు చెప్పింది. “గూడెంలోని జీవనశైలి, కుటుంబ పోషణ” విధానంపై పాత్ర చేశానని, తనతోపాటు గూడెంలోని పిల్లలందరూ చదువుకోవాలన్న తులసి కోరిక మేరకు ఇటీవల మంత్రి సీతక్కస్కూల్ భవనం నిర్మించి ప్రారంభించారు. తులసి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
Sorry, no posts matched your criteria.