India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 27 మందికి స్థానచలనం కల్పిస్తూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు.

జనగామ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్ని వీర్ వాయులో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి గురువారం తెలిపారు. ఇంటర్ లేదా డిప్లమా పూర్తి చేసి, 3-07-2004 నుంచి 03-01-2008 మధ్య పుట్టి పెళ్లి కాని యువతి, యువకులు ఇందుకు అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గంజాయి అక్రమరవాణాను మహబూబాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. MHBD- ఇల్లందు రోడ్డులో కళ్యాణి నర్సరీ వద్ద ఎస్ఐ దీపిక ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కారులో వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన అజిత్ అరుణ్, ఆనందరావును పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రూ.11,20,000 విలువైన 56కేజీల గంజాయి, ఒక కారు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సర్వయ్య తెలిపారు.

తాను బాగా చదువుకొని టీచర్ అవుతానని తక్కల్లగూడెం గుత్తిగూడెం ఆదివాసీ బిడ్డ పూనెం తులసి అంటోంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన పాత్రను నేచురల్ చేసినట్లు చెప్పింది. “గూడెంలోని జీవనశైలి, కుటుంబ పోషణ” విధానంపై పాత్ర చేశానని, తనతోపాటు గూడెంలోని పిల్లలందరూ చదువుకోవాలన్న తులసి కోరిక మేరకు ఇటీవల మంత్రి సీతక్కస్కూల్ భవనం నిర్మించి ప్రారంభించారు. తులసి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు క్వింటా పసుపు ధర భారీగా పెరిగింది. నిన్న రూ.12,501 పలికిన పసుపు నేడు రూ. 13,759 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ. 6160 (నిన్న రూ.6110) పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4550 (నిన్న రూ.4300) పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.13వేల ధర వచ్చింది.

కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా ఐఆర్ సీటీ దివ్య దక్షిణ జ్యోతిర్లింగ యాత్ర ప్యాకేజ్ టూర్‌ను ప్రవేశ పెట్టినట్లు యాత్ర ఇన్చార్జ్ కొక్కుల ప్రశాంత్ తెలిపారు. యాత్ర ఆగస్టు 4న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై అదే నెల 12 వరకు సాగుతుందని తెలిపారు. యాత్ర మొత్తం 8 రాత్రులు, 9 పగలు ఉంటుందన్నారు. ఈ యాత్ర ప్రత్యేక రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, మీదుగా సాగుతుందని తెలిపారు.

కేసముద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఓ విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన విద్యార్థినిని సిబ్బంది ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 9వ తరగతి చదువుతున్న ఆమె.. వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లింది. తిరిగి బుధవారం హాస్టల్లో చేరగా.. సా.5గం. ప్రాంతంలో గురుకులంలోని ఒకటో అంతస్తు పైనుంచి కిందపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. 16.17 టీఎంసీ నిల్వ సామర్థ్యం కలిగిన బ్యారేజీకి మంగళవారం ఇన్ఫో 35,200 క్యూసెక్కులు రాగా.. బుధవారం 41,500 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రవాహం 89.90 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మళ్లీ తగ్గింది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఈరోజు రూ.100 పడిపోయింది. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,24, బుధవారం రూ.7,400 పలికింది. ఈ క్రమంలో నేడు రూ.7,300కి తగ్గింది. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కు అయిన ఎంజీఎం ఆస్పత్రిలో గుండె సంబంధిత అత్యవసర సేవలు నిలిచిపోయాయి. అత్యాధునిక యంత్రాలున్నా సరైన టెక్నీషియన్లు లేక 2డీ ఏకో పరీక్షలు చేయడం లేదు. 2డీ ఎకో పరీక్షల కోసం బుధవారం పేషంట్లను కేఏంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆర్ఎంఓ-3 శ్రీనివాస్ స్పందిస్తూ పరీక్షలు చేయడం లేదనే విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి నేడు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.