India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
తాడ్వాయిలో ప్రమాదం తప్పింది. పసర నుంచి ఏటూరు నాగారం వైపు వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాద సమయంలో తాడ్వాయిలో వర్షం పడుతుండగా రోడ్డుపైన ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్ వైర్లు తెగి రోడ్డుకి అడ్డంగా పడ్డాయి.
వరంగల్ జిల్లాలో ఈ వానాకాలంలో 2.90లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా 1.34లక్షల ఎకరాల్లో వరి, 1.22లక్షల ఎకరాల్లో పత్తి, 4వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని అభిప్రాయ పడుతున్నారు. కాగా గతేడాది పత్తికి మార్కెట్లో కొంత మెరుగ్గానే మద్దతు ధర రావడంతో ఈ సారి పత్తి సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకుగాను ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా మూడు సంవత్సరాల పదవీ కాలంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వేసిన విజిలెన్స్ విచారణ కమిటీని స్వాగతిస్తున్నానని తెలిపారు. తాను ఇక్కడే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి, ఇక్కడే ఉన్నత విద్యను అభ్యసించి ఇక్కడే ఉద్యోగం పొంది 30 సంవత్సరాలకు పైగా నిబద్ధతగా పనిచేశానన్నారు.
భూమి పట్టాచేయాలని కుమారుడు తల్లిపై దాడి చేసిన ఘటన ఎల్కతుర్తి మండలంలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. పెంచికల్పేట్ గ్రామానికి చెందిన చిలుముల లక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమారుడు రఘుపతి ఈ నెల 17న తన భాగానికి వచ్చిన భూమి తోపాటు తల్లి దగ్గరున్న 20 గుంటలు కూడా తన పేరున పట్టా చేయాలని లక్ష్మిని తీవ్రంగా కొట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం నిందితుడిపై కేసు నమోదు చేశారు.
BRS, కాంగ్రెస్ DNAలు ఒక్కటేనని BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS నుంచి గెలిచిన MLAలు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని.. 20 రోజుల్లో 25 మంది చేరుతారని వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రజల తరఫున పోరాటం చేయాలని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా మారుతున్నారని పేర్కొన్నారు. HNKలో శనివారం MLC ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
జూన్ 9న జరగనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీపీలు, ఎస్పీ, డీసీపీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
తాడ్వాయి మండలం దామెరవాయి రాక్షసగుహలు సమీపంలోని ఊర చెరువులో ఉపాధిహామీ పనులు చేపట్టారు. చెరువుల మట్టిని తవ్వుతున్న క్రమంలో విలేజ్ అన్వేషకుడు కార్తీక్‌కు అరుదైన ముద్ర లభించింది. ఈముద్ర ఎరుపు వర్ణంలో 5 రేకులతో కూడిన పువ్వు గుర్తు ఉంది. లభించిన ముద్రను పరిశోధకుడు రత్నాకర్ రెడ్డికి అందజేయగా సుమారు 2500 సం. కాలం నాటిదై ఉండవచ్చని తెలిపారు.
తెలంగాణ EAPCET ఫలితాల్లో హనుమకొండ విద్యార్థిని ప్రతిభ కనబరిచారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేటగిరిలో రెడ్డికాలనీకి చెందిన గడ్డం శ్రీవర్షిణి 145.26 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. కాగా శ్రీవర్షిణి హనుమకొండలో పదో తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమెను కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పాత మగ్దుంపురం శివారు వ్యవసాయ భూముల్లోని పిల్ల కాలువలో మొసలి ప్రత్యక్షమైంది. ఆ మొసలిని స్థానికులు చూసి భయాందోళన చెందారు. ఈ కాలువకు సమీపంలో కొన్ని ఇళ్లు ఉండటంతో స్థానికులు, రైతులు భయపడుతున్నారు. మొసలిని మరో చోటకు వెళ్లేలా చూడాలని అటవీ శాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.