India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి మే 27న పోలింగ్ జరగనుంది. రాకేశ్ రెడ్డి (BRS), తీన్మార్ మల్లన్న (INC), ప్రేమెందర్ రెడ్డి (BJP)తో పాటు మరో 49 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల వ్యాప్తంగా 1,67,853 మంది ఓటు హక్కు పొందారు. అత్యధికంగా WGL జిల్లాలో 43,594, HNKలో 43,383, MHBD 34,759, జనగామ 23,320, భూపాలపల్లి 12,460, ములుగులో అతి తక్కువగా 10,237 మంది ఓటర్లు ఉన్నారు.
విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లాకి చెందిన రాఘవేంద్ర (23) శంభునిపేట విశ్వనాథ రాఘవేంద్ర కాలనీలో ఉంటున్న అత్తగారింటికి వచ్చాడు. సాయంత్రం కురిసిన వర్షానికి తడిసి ఇంటికి వచ్చిన ఆయన గుడిసెలోకి వెళ్తున్న క్రమంలో ఫ్యాన్‌కు చేయి తగిలింది. దీంతో కరెంట్ షాక్‌కి గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని MGMకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. సగటున 49 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా WGLలో 85.4 మి.మీ, వర్ధన్నపేటలో 84.2 మి.మీ, రాయపర్తిలో 73.6, అత్యల్పంగా నర్సంపేటలో 17.4 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రకాళి ఆలయం రోడ్డులో 50-60 ఏళ్ల క్రితం నాటి రావి చెట్టు నేలకూలింది. చేతికొచ్చిన పంట నేలకొరిగింది. ధాన్యం గింజలు రాలిపోయాయి. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు రేపు, ఎల్లుండి సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు వారాంతపు యార్డు బంద్, ఎల్లుండి (ఆదివారం) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు విషయాన్నీ గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకుని రావద్దని సూచించారు.
పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నినిస్తారని, ఇప్పటివరకు నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌పై మల్లన్న ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రభుత్వాన్ని, ప్రశ్నించే వ్యక్తి కావాల ప్రశ్నించలేని వ్యక్తి కావాలా ఆలోచించాలన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు.
నర్సంపేటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఎంపీసీ, బైపిసి కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతున్నారు. పదో తరగతి పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 23న నర్సంపేటలోని కళాశాలలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని ప్రాంతీయ సమన్వయ అధికారి వెంకన్న తెలిపారు.
40 సం. క్రితం జైలు నుంచి బెయిల్ పై విడుదలై తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని జైలు అధికారులు గురువారం పట్టుకున్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన సందు వీరన్నకి 1982లో ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడగా, 1984లో పెరోల్‌పై విడుదలయ్యాడు. అనంతరం పెరోల్ సమయం ముగిసినా జైలుకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతుండగా.. సమాచారం అందుకున్న జైలు అధికారులు పెద్ద ముప్పారం గ్రామంలో పట్టుకున్నారు.
రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా, ఈసారి ఇప్పటివరకు 80,723 వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య శ్రీరామోజు నరసింహాచారి తెలిపారు. ఈ నెల 17 వరకు రూ.250 రుసుముతో దరఖాస్తుకు అవకాశం ఉండగా, రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 27 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
Sorry, no posts matched your criteria.