India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేటి నుంచి జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతవరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతుండగా.. 3 రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆయా జిల్లాల అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రెండు జిల్లాల్లో ఇంకా వరికోతలు పూర్తికాలేదు.
వరంగల్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 13న జరిగిన ఎన్నికలలో 5,68,165 లక్షల మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ స్థానం పరిధిలో 18,44,66 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల్లో 12,55,361 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ స్థానం మొత్తం పోలింగ్ సరళిని పరిశీలిస్తే 70 శాతాన్ని కూడా అందుకోలేకపోయింది. మహిళల కన్నా పురుషులే అధికంగా ఓటేశారు.
ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో గల ఖాళీలను పొరుగు సేవల (out sourcing) కింద భర్తీకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఖాళీ పోస్టుల వివరాలు.. డిసెక్షన్ హాల్ అటెండెన్స్ 4, డాటా ఎంట్రీ ఆపరేటర్ 10, ఆఫీస్ సబార్డినేట్ 8, థియేటర్ అసిస్టెంట్ 4, ల్యాబ్ అటెండెంట్ 4, రికార్డ్ అసిస్టెంట్ 2 పోస్టులను భర్తీ చేయనుంది.
జబర్దస్త్ ఫేం కెవ్వు కార్తీక్ కు మాతృ వియోగం కల్గింది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కార్తీక్ బుల్లి తెరపై వివిధ కార్యక్రమాల్లో నటిస్తున్నాడు. ఆయన తల్లి ఒడపల్లి కరుణ(56) గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. హైద్రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. బుధరావుపేటకు చెందిన పలువురు కరుణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్‌ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా మే 4వ తేదీ వరకే ఆఖరి గడువుగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు. పోలింగ్ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం పేర్కొంది.
KF లైట్ బీర్‌లో నీళ్లున్నాయంటూ ఓ వినియోగదారుడు ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. వివరాలిలా.. ఈ నెల 14న ములుగు మండలంలోని ఓ వైన్స్‌లో 6 బీర్లు కొనగా, వాటిలో 5 బీర్లలో ఆల్కహాల్‌కు బదులు నీళ్లున్నట్లు గుర్తించాడు. దీంతో ఎక్సైజ్ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈమేరకు బీర్ బాటిల్‌ను ల్యాబ్‌కు పంపిస్తామని, నిర్ధారణ అయితే వైన్‌షాపుపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినట్లు యువకుడు తెలిపాడు.
సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 17 నుంచి 15 రోజులు మూసివేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ రమేశ్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 40కి పైగా ఉన్న సింగిల్ థియేటర్లు మూసివేయనున్నారు. మల్టీఫ్లెక్స్‌లు మాత్రం కొన్నిరోజులు కొనసాగుతాయన్నారు. మారుతున్న సాంకేతిక ప్రభావంతో ఓటీటీల్లో కోరుకున్న సినిమా అనుకూలమైన సమయంలో ఇంట్లోనే తిలకించే అవకాశం రావడమే ముఖ్యకారణంగా చెబుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు KMM-NLG-WGL ఎమ్మెల్సీ ఉపఎన్నికలపై దృష్టి సారించాయి. ఎట్టి పరిస్థతుల్లోనూ ఈస్థానంలో పాగా వేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. BRS నుంచి రాకేశ్ రెడ్డి పోటీలో ఉండగా ఆయనకు మద్దతుగా గతంలో ఈస్థానం నుంచి గెలిచిన పల్లా వ్యూహాలను రచిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డినే బీజేపీ ఈ దఫా బరిలోకి దింపింది.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామశివారులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలిలా.. బుధరావుపేట గ్రామానికి చెందిన రావుల వెంకన్న (45) అనే గీత కార్మికుడు రోజు వారి వృత్తిలో భాగంగా ఐనపల్లికి సైకిల్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ నుంచి నర్సంపేట వైపు వేగంగా వస్తున్న కారు సైకిల్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు.
మహబూబాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్‌గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది.
బలరాం నాయక్(కాంగ్రెస్)పై మాలోత్ కవిత (BRS) 1,46,663 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అర్జున్ కుమార్ (TJS) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో బలరాం నాయక్(కాంగ్రెస్), సీతారాం నాయక్ (BJP), మాలోత్ కవిత(BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.