Warangal

News May 16, 2024

వరంగల్ మార్కెట్ నేడు పునఃప్రారంభం

image

6 రోజుల సుదీర్ఘ సెలవుల అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ నేడు పున ప్రారంభం కానుంది. ఈనెల 13న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 10 నుంచి 15 వరకు 6రోజుల సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు మార్కెట్ ప్రారంభం కానుండటంతో ఉ.6 గం.ల నుంచే మార్కెట్లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించాలని కోరారు.

News May 15, 2024

రాకేశ్ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పని చేయాలి: కేటీఆర్

image

వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలను పార్టీ కార్యకర్తలు పట్టభద్రులకు వివరించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

News May 15, 2024

వరంగల్: 2007 నుంచి BRSదే గెలుపు!

image

NLG-KMM-WGL MLC స్థానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీదే హవా నడిచింది. ఉమ్మడి ఏపీలో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గెలిచారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి 2009 పోటీ చేసిన దిలీప్ కుమార్ మరోసారి విజయం సాధించారు. 2015, 21లోనూ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.

News May 15, 2024

మరో కీలక ఎన్నికకు వరంగల్ సిద్ధం

image

లోక్‌సభ పోరు ముగియగా మరో సమరానికి వరంగల్ సిద్ధమైంది. NLG-KMM-WGL MLC స్థానానికి ఈ నెల 27న బైపోల్ జరగనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న (INC), BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండింపెండెంట్‌గా అశోక్ పోటీ చేస్తున్నారు.

News May 15, 2024

WGL, MHBDలో 23,57,331 మంది ఓటేశారు!

image

2019 ఎన్నికలతో పోలిస్తే వరంగల్‌ లోక్‌సభ స్థానంలో 2024లో ఓటింగ్‌ శాతం పెరిగింది. అప్పుడు 63.65% నమోదు కాగా.. ఇప్పుడు 68.86% పోలింగ్ అయింది. మహబూబాబాద్‌లోనూ 2019లో కంటే ఈసారి 2.81% మంది అధికంగా పోలింగ్‌లో పాల్గొనడంతో 71.85% నమోదైంది. ఈ రెండు స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉండగా.. 70.22 శాతంతో 23,57,331 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరి మీరు ఓటేశారా? కామెంట్.

News May 15, 2024

REWIND-2019: వరంగల్‌లో BRSకి 3,50,298 ఓట్ల మెజార్టీ!

image

వరంగల్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. దొమ్మాటి సాంబయ్య(కాంగ్రెస్)పై పసునూరి దయాకర్(BRS) 3,50,298 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. చింతా సాంబమూర్తి(BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో కావ్య(కాంగ్రెస్), ఆరూరి రమేశ్(BJP), సుధీర్ కుమార్(BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 14, 2024

FINAL: MHBD ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 71.85%

image

మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. భద్రాచలం-69.02%, డోర్నకల్-75.39%, మహబూబాబాద్-71.24%, ములుగు-69.66%, నర్సంపేట-76.60%, పినపాక-69.40%, ఇల్లందు-70.48%గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 71.85% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత బరిలో ఉన్నారు.

News May 14, 2024

FINAL: వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 68.86%

image

వరంగల్ లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. భూపాలపల్లి- 67.71%, స్టే.ఘ-78.77%, పాలకుర్తి- 71.43%, పరకాల-76.86%, వర్ధన్నపేట-72.24%, వరంగల్ ఈస్ట్ -65.08%, వరంగల్ వెస్ట్- 52.68%గా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ 68.86% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, BJP నుంచి ఆరూరి రమేశ్, BRS నుంచి సుధీర్ కుమార్ బరిలో ఉన్నారు.

News May 14, 2024

భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో దత్తాత్రేయ ఆలయ మూడో వార్షికోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ప్రజలు సంతోషంగా ఉండాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.

News May 14, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలజడులు ఇక్కడే

image

*జనగామ జిల్లా ధర్మకంచ(263)లో పోలింగ్‌ను పరిశీలించేందుకు యువజన కాంగ్రెస్‌ నేత కొమ్మూరి ప్రశాంతరెడ్డి వచ్చారు. దీంతో BRS నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
*సంగెం మం. ఎల్గూరుస్టేషన్‌లోని 211 పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి ఓ యువకుడు ఫొటోతీసి వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు.
*జనగామ మం.లోని గానుగుపహాడ్‌ ZPHSలో BRS, BJP నాయకులు టెంట్లు ఏర్పాటు చేశారు. వాటిని తీసేయాలని పోలీసులు సూచించగా వాగ్వాదం చోటుచేసుకుంది.