Warangal

News May 12, 2024

వరంగల్: ఏజెన్సీలో 4 గంటల వరకే పోలింగ్

image

ఈనెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఏజెన్సీ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని తహశీల్దార్ రమాదేవి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలు అధికంగా ఏజెన్సీలో ఉండటంతో ఇక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 తర్వాత ఓటర్లను లోనికి అనుమతించమన్నారు.

News May 12, 2024

HNK: రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తాపట్నాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

News May 11, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు TOPNEWS

image

> జిల్లావ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం
> ములుగు: అన్నం పెట్టలేదని సెల్ టవర్ ఎక్కిన యువకుడు
> జిల్లాలో సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చిన 144 సెక్షన్
> ETNR: లారీ-బైకు ఢీ..యువతికి తీవ్రగాయాలు
> బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడోరోజు భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు
> MHBD: బిల్డింగ్ పై నుండి పడి యువకుడికి గాయాలు
> WGL,KZP రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ
> ములుగు: పొలంలోకి దూసుకెళ్లిన ఆటో..పలువురికి గాయాలు

News May 11, 2024

ములుగు: అన్నం పెట్టడం లేదని.. సెల్ టవర్ ఎక్కాడు!

image

ఇంట్లో వాళ్ళు తనకు అన్నం పెట్టడం లేదని అలిగి ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కిన సంఘటన ములుగు జిల్లా కమలాపురంలో చోటుచేసుకుంది. శ్యామల రాజేశ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ఇంట్లో అన్నం పెట్టడం లేదని గొడవ పెట్టుకున్నాడు. అనంతరం పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిద్రపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు టవర్ వద్దకు చేరుకుని రాజేశ్‌ని కిందికి దింపి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.

News May 11, 2024

ములుగు: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

బావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. తెలుపు రంగు పుల్ బనియన్, బ్లూ రంగు చెక్స్ డిజైన్ గీతల లుంగీతో మృతదేహాం ఉందన్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే ములుగు పోలీసులను సంప్రదించాలని కోరారు.

News May 11, 2024

భూపాలపల్లి: టిప్పర్ ఢీ కొని ఇద్దరు మృతి

image

భూపాలపల్లిలోని మంజునగర్‌లోని ఏరియా హస్పిటల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మంజునగర్ బస్టాండ్‌లో నిల్చున్న ప్రయాణికులను టిప్పర్ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఓటువేసేందుకు స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్‌లో నిల్చుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

News May 11, 2024

WGL: ఏజెన్సీ ప్రాంతాల్లో ముగిసిన ప్రచారం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. వరంగల్ ఎంపీ నియోజకవర్గపరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని ములుగులో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా మైకులతో హోరెత్తిన ప్రాంతాలు ఒక్కసారిగా మూగబోయాయి.

News May 11, 2024

MHBD: బీజేపీ, బీఆర్ఎస్‌ల మాటలు నమ్మొద్దు: బలరాం నాయక్

image

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే అధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని, ప్రజలు తనకు అండగా నిలవాలన్నారు.

News May 11, 2024

HNK: మిర్చి బజ్జీలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య

image

హనుమకొండ చౌరస్తాలోని ఓ మిర్చి బండి వద్ద కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య మిర్చి బజ్జీలు చేస్తూ సందడి చేశారు. అంతకు ముందు కాజీపేట నుంచి చౌరస్తా వరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే వరంగల్ అభివృద్ధి సాధ్యమని కావ్య అన్నారు.

News May 11, 2024

WGL: ఉపాధి హామీ పనులు చేసిన BRS ఎంపీ అభ్యర్థి

image

బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాలోతు కవిత ఉపాధి హామీ పనులు చేశారు. కురవి మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి, తనని గెలిపించాలని కోరారు. ఈ క్రమంలోనే గడ్డపార పట్టి, మట్టి తవ్వి ఉపాధి హామీ పనులు చేశారు. ఆమెతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పనుల్లో పాల్గొన్నారు.

error: Content is protected !!