India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జనగామ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వరంగల్ జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రెండవ రోజు ప్రశాంతంగా ముగిశాయి. పేపర్ ఏ సెట్ వచ్చింది. రెండవ రోజు మొత్తం 5626కి 5473 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 153 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయినట్లు అధికారులు తెలిపారు. మాల్ ప్రాక్టీస్ కింద ఎవరు దొరకలేదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మందు పార్టీ చేసుకోవడం వివాదాస్పదమైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు గురువారం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పోలీస్ స్టేషన్ అధికారుల తీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ విచారణ జరిపి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధరలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,880 పలకగా.. మంగళవారం రూ.6,920 పలికింది. బుధవారం స్వల్పంగా తగ్గి రూ.6,900కి చేరింది. అయితే గురువారం సైతం రూ.6,900 పలికినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. అయితే పత్తి ధరలు పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లాలో 6,266 మొదటిరోజు 5,999 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 267 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మొదటి రోజు ఒకరు మాల్ ప్రాక్టీస్ చేస్తే పట్టుపడ్డారు.
నెక్కొండలో జరిగిన యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో తొమ్మిదో తరగతి విద్యార్థి మరణించినట్లు SI మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నెక్కొండకు చెందిన మహమ్మద్ సాజిద్(16)మోడల్ స్కూల్లో చదువుతున్నాడు. స్కూల్ నుంచి మధ్యాహ్నం నెక్కొండకు స్కూటీపై వస్తున్నాడు. ఈ క్రమంలో CH సంతు బైక్‌పై నెక్కొండ నుంచి వెంకటాపురం వెళ్తూ వేగంగా స్కూటీని ఢీకొన్నాడు. ప్రమాదంలో సాజిద్ మరణించాడు.
HYD మలక్‌పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. HNK జిల్లా పరకాలకు చెందిన శిరీష దోమలపెంటకు చెందిన వినయ్‌ని వివాహం చేసుకుంది. ఈ మేరకు శిరీషను వినయ్ సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరి ఆడకుండా చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో వినయ్, అతడి సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల మిర్చి ధరలు ఎలా ఉన్నాయి. నిన్న క్వింటా తేజ మిర్చి ధర రూ.14,200 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే 341 రకం మిర్చికి సోమవారం రూ.14,100 ధర రాగా.. నేడు రూ. 14,600కి పెరిగింది. మరోవైపు వండర్ హాట్(WH) రకం మిర్చి నిన్న రూ.17,200 ధర పలకగా.. ఈరోజు రూ.16,800 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 33 నుంచి 35 డిగ్రీలతో పాటు.. మేఘావృతమై ఉంటుందని, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతవరణ సూచికలు చెబుతున్నాయి.
Sorry, no posts matched your criteria.