India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరణించిన బాలుడు పెద్దవంగర మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన చింతం జస్వంత్‌గా గుర్తించారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఇన్ని రోజులుగా పాటలతో, మాటలతో హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు మరో 48 గంటల సమయమే మిగిలి ఉండటంతో, అటు మద్యం దుకాణాలు సైతం ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మూతపడనున్నాయి. ప్రచార పర్వం ముగుస్తుండటంతో అటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పర్వం మొదలు కానుంది.
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పర్వతగిరి మండలంలోని రావూరు గ్రామానికి చెందిన నాగరాజు(28) గుండెపోటుతో మృతి చెందాడు. అయితే రోజు వారీలాగే ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లొచ్చాడు. సాయంత్రం 9 నుంచి 10 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించాడు.
గత పదేళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ మనకు అవసరమా? అని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రశ్నించారు. భీమారంలో నిర్వహించిన రోడ్ షోలో కావ్య పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోని కోట్లాది మందిని నిరుద్యోగులుగా మార్చారని మండిపడ్డారు. వరంగల్ ప్రజలు బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కావ్య అన్నారు.
గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా పలు మండలాల్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ జీఎస్టీ పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేసిందని, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని అన్నారు.
బీజేపీ రాష్ట్రంలో లేదు.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో లేదని, ఆ పార్టీకి ఓటు వేస్తే మనకు జరిగే లాభమేమీ లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రం, ఉప్పుగల్లు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే కడియం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ప్రధానమంత్రి మోదీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదని కడియం అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరూరిని కోలాట బృందాలు, డప్పు చప్పులతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. వరంగల్ అభివృద్ధి చెందాలన్నా, నిధులు రావాలన్నా.. బీజేపీని ఆశీర్వదించాలని అన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ పట్టణంలోని నందిని నగర్ సమీపంలో గూడూరు తహశీల్దార్ కారు, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఉత్వర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13 సాయంత్రం 6 గంటల వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.
ములుగు జిల్లాలో మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వాజేడు మండలం జగన్నాథపురంలోని వై-జంక్షన్ వద్ద మావోయిస్టు వాల్ పోస్టర్లు వెలిశాయి. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని, హిందుత్వ ఫాసిస్టు బీజేపీ, ఆ పార్టీతో అంటకాగుతున్న ఇతర పార్టీలను తరిమికొట్టాలని వెంకటాపురం-వాజేడు ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు. ఈ వాల్ పోస్టర్లతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Sorry, no posts matched your criteria.