India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-12.07%, డోర్నకల్-14.60, మహబూబాబద్-11.65%, ములుగు-11.38, నర్సంపేట-11.20, పినపాక-11.95, ఇల్లందు-11.90శాతంగా ఉన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఓ వైపు వర్షం.. మరోవైపు నేడు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో.. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయి కరెంట్ లేక పలు సమస్యలు తలెత్తాయి. వర్షం నీరు భారీగా నిలిచి ఓటర్లు చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు వర్షం, ఎండల నేపథ్యంలో ఉదయమే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.
భారత రాజ్యాంగం రూపొందించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తొర్రూరు హైస్కూల్‌లో 258వ బూతులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనికి వస్తుంది. జిల్లాలోని జనగామ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాబాద్ పరిధిలోకి, మిగిలిన ఏడు నియోజకవర్గాలు వరంగల్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.
లోక్‌సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఇలా చేయకండి. ⏵ఓటర్లను ప్రైవేటు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలింపు
⏵శాంతి భద్రతల ఆటంకం
⏵ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం
⏵ఓటర్లకు నగదు, బహుమతుల పంపిణీ
⏵మాదకద్రవ్యాలు పంచడం, తరలించడం
⏵రెచ్చగొట్టే ప్రసంగాలు, దాడులు
⏵అసత్య వార్తలు వ్యాప్తి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన సతీమణి ఎర్రబెల్లి ఉషాతో కలిసి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎర్రబెల్లి కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ మొదలైంది. శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ-లైన్లలో వేచి ఉన్నారు. ఎండల నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
వరంగల్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం పడింది. గీసుగొండలో 61.9 మి.మీ, ఖానాపురంలో 61 మి.మీ, వరంగల్‌లో 59.8 మి.మీ, ఖిలా వరంగల్‌లో 43,5 మి.మీ, సంగెంలో 28.8 మి.మీ, దుగ్గొండిలో 25.3 మి.మీ, నర్సంపేటలో 10 మి.మీ వర్షం పడింది. జిల్లావ్యాప్తంగా సరాసరి 22.3 మి.మీ వర్షం కురిసింది. మొత్తంగా 292.3 మి.మీ వర్షం పడినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గతేడాది జరిగిన అసెబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి WGL 12 అసెంబ్లీ స్థానాల్లోని WGL తూర్పు, పశ్చిమ మినహా మిగతా 10స్థానాల్లోని చాలా కేంద్రాల్లో 90%పైగా ఓటింగ్ నమోదైంది. ఈ క్రమంలోనే 1952 నుంచి 2019 వరకు WGL లోక్‌సభ స్థానంలో 2014లో 76.39% అత్యధికంగా 1952లో అత్యల్పంగా 51.03% నమోదయింది. MHBD స్థానంలో 1957లో అత్యల్పంగా(53.82), 2014లో 81.05% ఓటేశారు. పట్టణాల్లో విద్యావంతులున్నా పల్లెల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది.
ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. WGL ఎంపీ స్థానంలో 2019లో 63.70 శాతం పోలింగ్ నమోదవగా మహబూబాబాద్‌లో 69.06 నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.
Sorry, no posts matched your criteria.