India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ఎన్నికల సంఘం తెచ్చిన సీ-విజిల్ మొబైల్ యాప్‌లో ఓటర్లను ప్రలోభ పెట్టే అంశాలపై ఫిర్యాదు చేయొచ్చని, వీడియోలు, ఫొటోలతో యాప్‌లో ఫిర్యాదు ఇస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు. తనిఖీ బృందాలు, ఎన్నికల పరిశీలకులు, ఇతర నిఘా బృందాలు నిరంతరం ఫిర్యాదులను పర్యవేక్షిస్తుంటాయి. అనధికార ప్రచారాలు, ఓటర్లను భయపెట్టడం, దాడులపై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి నేటివరకు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేని రూ.870,840 నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా SP సుధీర్ రామ్నాథ్ కెనాన్ తెలిపారు. అలాగే రూ.91,18,107 విలువచేసే మద్యాన్ని సీజ్ చేశామని, రూ.11,04,150ల విలువ చేసే గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో వివిధ వ్యక్తులు 18 తుపాకులను డిపాజిట్ చేశారన్నారు.
నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమ, బాధ్యతలోనూ. మన ఓరుగల్లు జిల్లాలో 33,56,832 మంది ఓటర్లున్నారు. -నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.
జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్ వద్ద జాతీయ రహదారిపై కారు ఢీకొని లచ్చమ్మ(70) మృతి చెందింది. కాగా, స్టేషన్ ఘన్‌పూర్లో కారు-స్కూటీ ఢీకొని రమేశ్(55) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓటరే నిజమైన నిర్ణేత. కానీ WGL జిల్లా దుగ్గొండి (M) గిర్నిబావిలో పాఠశాల లేదని పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. 2018లో ఏర్పడిన గిర్నిబావి పంచాయతీ.. NSPTకు 10KM దూరంలో ఉంది. ఇక్కడి ఓటర్లను రెండు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. 936 మంది ఓటర్లు ఉండగా.. మందపల్లికి 530, తొగర్రాయికి మరో 406 మంది ఓటర్లను కేటాయించారు. గిర్నిబావిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
HYD నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న స్పెషల్ RTC బస్సుల్లో ప్రయాణానికి RTC ఛార్జీలు 1.25% పెంచినట్లు అధికారులు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బస్సుల్లో రద్దీ ఏర్పడింది. వన్ సైడ్ ట్రాఫిక్ అధికంగా ఉందని, తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉప్పల్-తొర్రూరు ఎక్స్‌ప్రెస్ సాధారణంగా రూ.220 కాగా.. స్పెషల్ బస్సులో రూ.250 తీసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతిచెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన తన్మయి తన చెల్లి TS F SET పరీక్ష కోసం శనివారం ఘట్ కేసర్‌కు బయలుదేరారు. ఈక్రమంలో కారు ఆలేరు వద్ద ఎదురుగా వచ్చిన ట్రాలీని ఢీకొట్టింది. ప్రమాదంలో తన్మయికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వరంగల్ MGMకి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. తన్మయి వరంగల్ వాగ్దేవి కాలేజీలో బీటెక్ చదువుతోంది.
ఈనెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఏజెన్సీ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని తహశీల్దార్ రమాదేవి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలు అధికంగా ఏజెన్సీలో ఉండటంతో ఇక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4 తర్వాత ఓటర్లను లోనికి అనుమతించమన్నారు.
ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తాపట్నాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ఉన్న హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
> జిల్లావ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం
> ములుగు: అన్నం పెట్టలేదని సెల్ టవర్ ఎక్కిన యువకుడు
> జిల్లాలో సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చిన 144 సెక్షన్
> ETNR: లారీ-బైకు ఢీ..యువతికి తీవ్రగాయాలు
> బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడోరోజు భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు
> MHBD: బిల్డింగ్ పై నుండి పడి యువకుడికి గాయాలు
> WGL,KZP రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ
> ములుగు: పొలంలోకి దూసుకెళ్లిన ఆటో..పలువురికి గాయాలు
Sorry, no posts matched your criteria.