India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 6 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 13న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 10(శుక్రవారం) నుంచి 15(బుధవారం) వరకు 6రోజుల సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి మార్కెట్ 16(గురువారం)న ప్రారంభం కానుంది. కావున రైతులు విషయాన్ని గమనించి మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు ప్రధానమంత్రికి గదను బహుకరించారు. వారి కోరిక మేరకు నరేంద్ర మోదీ గదను ఎత్తి, ప్రజలకు అభిమానం చేశారు. ఈ సన్నివేశాన్ని చూసిన కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ‘జై మోదీ’ అంటూ నినాదాలు చేశారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో మామునూర్‌లో భారీ జన సభ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తకు చెందిన ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ చిన్నారిని ప్రధాని ఆప్యాయంగా ముద్దాడారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. కుండపోత వాన పడటంతో మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఎక్కడికక్కడ ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు పశువులు మృత్యువాత పడ్డాయి.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇంకా 3 రోజులే సమయం ఉండటంతో ప్రజలతో మమేకమడం అభ్యర్థులకు కష్టంగా మారింది. WGL లోక్‌సభ పరిధిలో 18.24 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా, సర్వే ఏజెన్సీలపై ఆధారపడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో అభ్యర్థుల వాయిస్‌లతో ఓటర్లకు సందేశాలు పంపిస్తున్నారు. ‘హలో.. మీ ఓటు ఎవరికీ?’ అని ఫోన్లకు కాల్ చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.
ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం గ్రామం లక్ష్మిపురంలో బుధవారం జరిగే ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు పూర్తి చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో వేములవాడ నుంచి ఉదయం 11.05 గంటలకు మోదీ బయలుదేరి 11.45 గంటలకు మామునూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.55 బహిరంగ సభ వేదిక పైకి వస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.50 గంటల వరకు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి హన్మకొండకు వచ్చారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా హన్మకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మంత్రులు సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తదితరులున్నారు.
వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనదారుడిపై చెట్టు కూలి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఇల్లంద గ్రామానికి చెందిన దయాకర్(22)గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన దయాకర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అధికారులకు రాకేష్ రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తాతా మధు, జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 22కు చేరిందని అధికారులు తెలిపారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా, జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, BRS నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బిజెపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
Sorry, no posts matched your criteria.