India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హన్మకొండలోని ఆర్ట్స్&సైన్స్ కాలేజ్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్, కేయూ గ్రౌండ్&కేయూ కామన్ మెస్, స్టడీ రూమ్‌లలో మార్నింగ్ వాక్ ద్వారా విస్తృతంగా పర్యటించారు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్, సుధాకర్ తదితరులున్నారు.
2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు పునః ప్రారంభం కాగా మార్కెట్ కు పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే ఈరోజు పెరిగింది. గతవారం రూ.6700 పలికిన పత్తి ధర.. ఈరోజు రూ.7040కి పెరిగింది. ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆశిస్తున్నారు.
తమ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేయనున్నారు. ఆదివారం గద్దెల వద్ద పూజారులు, వాటాదారులు సమావేశం నిర్వహించారు. వరంగల్‌లో తమకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు భద్రకాళి దేవస్థాన పూజారులు చూస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే 2రోజులు దర్శనాల నిలిపివేతకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
KMM-WGL-NLG MLC స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మల్లన్న (INC), రాకేశ్ రెడ్డి (BRS), ప్రేమేందర్ రెడ్డి (BJP) పోటీ చేస్తున్నారు. అయితే ముగ్గురు గతంలో BJPలో ఉన్నవారే. తీన్మార్ మల్లన్న 2021లో BJPలో చేరి, తిరిగి 2023లో హస్తం గూటికి చేరారు. ప్రేమేందర్ రెడ్డి BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాకేశ్ రెడ్డి 2013లో BJPలో చేరి BJYMలో అనేక పదవులు చేపట్టారు. ఈ ఏడాదే BRS పార్టీలో చేరారు.
ఆస్తి తగాదాల్లో తాతను మనవళ్లు హత్యచేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో జరిగింది. హసన్‌పర్తికి చెందిన జల్లి సారయ్య (80)తో అతని మనవళ్లు సాయికృష్ణ, శశికుమార్ పలుమార్లు ఆస్తి విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే వారిద్దరు సారయ్యపై పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం వాకింగ్ స్టాండ్‌తో సారయ్య తలపై బలంగా కొట్టగా.. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఈ పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించగా ఈసారి ఆన్లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు. డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు సైతం పరీక్ష రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,949 మంది హాజరుకానున్నారు.
అరూరి రమేశ్ వరంగల్ లోక్‌సభ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 87,238 ఓట్లు సాధించి ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అరూరి ఈ లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– దీనిపై మీ కామెంట్?
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
తాడ్వాయిలో ప్రమాదం తప్పింది. పసర నుంచి ఏటూరు నాగారం వైపు వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాద సమయంలో తాడ్వాయిలో వర్షం పడుతుండగా రోడ్డుపైన ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్ వైర్లు తెగి రోడ్డుకి అడ్డంగా పడ్డాయి.
వరంగల్ జిల్లాలో ఈ వానాకాలంలో 2.90లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా 1.34లక్షల ఎకరాల్లో వరి, 1.22లక్షల ఎకరాల్లో పత్తి, 4వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని అభిప్రాయ పడుతున్నారు. కాగా గతేడాది పత్తికి మార్కెట్లో కొంత మెరుగ్గానే మద్దతు ధర రావడంతో ఈ సారి పత్తి సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకుగాను ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.
Sorry, no posts matched your criteria.