Warangal

News June 29, 2024

మావోయిస్టుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

మహారాష్ట్ర, తెలంగాణా సరిహద్దులోని పోలీసులు.. మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మావోల ప్రాబల్యం ఉన్నందున, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News June 28, 2024

వరంగల్: వంగర పర్యాటకం కలేనా!

image

దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడైన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగర పర్యాటకాభివృద్ధి కలగానే మిగిలింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా 2020లో మాజీ సీఎం కేసీఆర్ వంగర గ్రామంలో పీవీ జ్ఞాన వేదిక స్మృతివనం ఏర్పాటుకు రూ.7 కోట్లు మంజూరు చేసినా పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. శుక్రవారం పీవీ 103వ జయంతి సందర్భంగా పనుల నత్తనడకపై గ్రామస్థులు విమర్శలు చేస్తున్నారు.

News June 28, 2024

జనగామ: కరెంట్ షాక్‌కు గురై వివాహిత మృతి

image

జనగామ జిల్లా జాఫర్గడ్ మండలం సూరారం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి వివాహిత మృతి చెందింది. ఎస్సై రవి యాదవ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుప్రియ మధ్యాహ్నం ఇంటి వద్ద పని చేస్తున్న క్రమంలో ఇంట్లోని విద్యుత్ వైరు చేతికి తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 28, 2024

హన్మకొండలో వృద్ధుడి కాళ్లపై నుంచి వెళ్లిన బస్సు

image

ప్రమాదవశాత్తు వృద్ధుడి కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలైన ఘటన హన్మకొండ బస్టాండ్ వద్ద నేడు చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. బస్టాండ్ మూల వైపు నుంచి వృద్ధుడు వెళ్తుండగా బస్టాండ్ లోపలి నుంచి వస్తున్న బస్సు వృద్ధుడి కాళ్లపై నుంచి వెళ్లింది. దీంతో వృద్ధుడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు.

News June 28, 2024

వరంగల్: అబ్జర్వేషన్ హోమ్‌కు ఇద్దరు మైనర్లు

image

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ ఇటీవల పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు ఈరోజు వారిపై జువెనైల్ కోర్టులో ఛార్జిషీట్ ఫైల్ చేయగా.. వారిని ఒకరోజు బాలల అబ్జర్వేషన్ హోమ్‌కి పంపించారు. ఇకపై వాహనాలు నడిపే మైనర్లను పట్టుకుని ఛార్జిషీట్ ఫైల్ చేసి కోర్టు ముందు మైనర్, వారి తల్లిదండ్రులను హాజరుపరుస్తామని పోలీసులు హెచ్చరించారు.

News June 28, 2024

వరంగల్ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకురావొద్దని, విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

News June 28, 2024

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలకగా.. ఏసీ 341 రకం మిర్చి రూ.16,500 పలికింది. వండర్ హాట్(WH) మిర్చికి రూ.17,000 ధర వచ్చింది. కాగా, నిన్నటితో పోలిస్తే 341, వండర్ హాట్ మిర్చి ధరలు రూ.500 తగ్గాయి. తేజా మిర్చి ధర అలానే ఉంది.

News June 28, 2024

వరంగల్: నేటి పత్తి ధర ఎంతంటే?

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర మళ్లీ తగ్గింది. నేడు క్వింటా పత్తికి రూ.7,160 ధర వచ్చింది. 3 రోజులుగా పత్తి ధరలు చూస్తే బుధవారం రూ.7,090, గురువారం రూ.7,210కి పలికాయి. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు రూ.50 తగ్గింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News June 28, 2024

వరంగల్‌: పడిపోతున్న పల్లి ధర!

image

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వేరుశనగ పంట సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గుముఖం పడుతోంది. గతేడాది సుమారు 5 వేల ఎకరాల వరకు సాగు చేసిన రైతులు ఈ ఏడాది 4,200 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. దానికి తోడు ఆకుమచ్చ, ఆకు పీల్చే పురుగులు తదితర కారణాలతో వేరుశనగ పంట దిగుబడి తగ్గిపోతోంది. గతేడాది క్వింటా రూ.8 వేల వరకు పలికిన పల్లి ఈ ఏడాది రూ.5 వేల వరకు పడిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

News June 28, 2024

పాకాల వెళ్లే పర్యాటకులకు శుభవార్త!

image

పాకాల వెళ్లే పర్యాటకులకు రెట్టింపు ఆనందం కలగనుంది. కొన్ని రోజులుగా నిలిచిన బోటు షికారు మళ్లీ ప్రారంభం కానుంది. గతంలో పాకాల సరస్సు WGL జిల్లా ఖానాపురం మండలంలో ఉండగా.. జిల్లాల పునర్విభజనతో కొంత భాగం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలో చేరింది. దీంతో అటవీ, పర్యాటక శాఖల మధ్య టికెట్ల పంపిణీలో తలెత్తిన కారణాలతో బోటు షికారు నిలిచింది. కాగా స్థానిక MLA చొరవతో బోటింగ్ మళ్లీ ప్రారంభించనున్నట్లు సమాచారం.