India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు రేపు, ఎల్లుండి సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు వారాంతపు యార్డు బంద్, ఎల్లుండి (ఆదివారం) సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రైతులు విషయాన్నీ గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకుని రావద్దని సూచించారు.
పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నినిస్తారని, ఇప్పటివరకు నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌పై మల్లన్న ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ప్రభుత్వాన్ని, ప్రశ్నించే వ్యక్తి కావాల ప్రశ్నించలేని వ్యక్తి కావాలా ఆలోచించాలన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు.
నర్సంపేటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఎంపీసీ, బైపిసి కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతున్నారు. పదో తరగతి పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 23న నర్సంపేటలోని కళాశాలలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని ప్రాంతీయ సమన్వయ అధికారి వెంకన్న తెలిపారు.
40 సం. క్రితం జైలు నుంచి బెయిల్ పై విడుదలై తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని జైలు అధికారులు గురువారం పట్టుకున్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన సందు వీరన్నకి 1982లో ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడగా, 1984లో పెరోల్‌పై విడుదలయ్యాడు. అనంతరం పెరోల్ సమయం ముగిసినా జైలుకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతుండగా.. సమాచారం అందుకున్న జైలు అధికారులు పెద్ద ముప్పారం గ్రామంలో పట్టుకున్నారు.
రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా, ఈసారి ఇప్పటివరకు 80,723 వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య శ్రీరామోజు నరసింహాచారి తెలిపారు. ఈ నెల 17 వరకు రూ.250 రుసుముతో దరఖాస్తుకు అవకాశం ఉండగా, రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 27 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించగా రెండు రోజులుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించి ఆన్లైన్ సేవలు ముందుకు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.
నేటి నుంచి జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతవరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతుండగా.. 3 రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆయా జిల్లాల అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రెండు జిల్లాల్లో ఇంకా వరికోతలు పూర్తికాలేదు.
వరంగల్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 13న జరిగిన ఎన్నికలలో 5,68,165 లక్షల మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ స్థానం పరిధిలో 18,44,66 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల్లో 12,55,361 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ స్థానం మొత్తం పోలింగ్ సరళిని పరిశీలిస్తే 70 శాతాన్ని కూడా అందుకోలేకపోయింది. మహిళల కన్నా పురుషులే అధికంగా ఓటేశారు.
ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో గల ఖాళీలను పొరుగు సేవల (out sourcing) కింద భర్తీకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఖాళీ పోస్టుల వివరాలు.. డిసెక్షన్ హాల్ అటెండెన్స్ 4, డాటా ఎంట్రీ ఆపరేటర్ 10, ఆఫీస్ సబార్డినేట్ 8, థియేటర్ అసిస్టెంట్ 4, ల్యాబ్ అటెండెంట్ 4, రికార్డ్ అసిస్టెంట్ 2 పోస్టులను భర్తీ చేయనుంది.
Sorry, no posts matched your criteria.